Home ఆంధ్రప్రదేశ్ వార్తలు దుర్గగుడి చైర్మన్ రాజీనామా

దుర్గగుడి చైర్మన్ రాజీనామా

Durga Gudiవిజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌ గౌరంగ్‌బాబు శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఆలయ ఇఒ కోటేశ్వరమ్మకు పంపించారు. తనతో పాటు పాలకమండలిలోని 14 మంది సభ్యులు కూడా  తమ పదవులకు రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించింది. దీంతో టిడిపి ప్రభుత్వం రద్దు అయింది. ఈ క్రమంలో టిడిపి ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు.

Durga Gudi Chairman Resigned