Home రాజన్న సిరిసిల్ల విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

కలెక్టర్ హెచ్చరిక

Collector2

సిరిసిల్ల: నిర్దేశించిన విధుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు చేపడుతామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హెచ్చరించారు. నిర్దేశిత గడువులోగా లక్షాలను సాధించని అధికారులను ఆయన మందలించారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాను మంత్రి కే తారక రామారావు ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా చేయాలని పట్టుదలతో అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుపట్ల, ప్రజలకు అవగాహన కల్పించడం పట్ల పలు శాఖల అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్షంపట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నిర్దేశిత గడువులోగా లక్షాలను సాధించడం అలవాటు చేసుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. అధికారులకు నిర్దేశించిన లక్షాలను చేరుకోవడంలో విఫలమైతే వారికి మెమోలు జారీ చేస్తామని, అదేవిధంగా శాఖా పరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. లక్షాల సాధనలో విఫలమైన అధికారులను ఆయన పేరుపేరున ఆక్షేపించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే శనివారం జిల్లాలోని ముఖ్య ఉద్యోగులందరితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, 2016కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు.