Search
Wednesday 14 November 2018
  • :
  • :

‘డీజె’ సెన్సార్ పూర్తి

DJ

వరుసగా బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దూకుడు మీదున్న అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డి.జె… దువ్వాడ జగన్నాథమ్’. రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు హిట్స్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా ఇది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో రూపొందిన 25వ సినిమా ఇది కావడం విశేషం. డీజె… సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యుఎస్‌లో 300 కేంద్రాలలో విడుదల చేస్తుండడం విశేషం.  ఇక అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మణ కుర్రాడిగా, స్టైలిష్ ఆఫీసర్‌గా… రెండు లుక్‌లలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.

Comments

comments