Home తాజా వార్తలు కెనెటిక్ ఇ-ఆటోను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

కెనెటిక్ ఇ-ఆటోను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

E-Autoహైదరాబాద్ : కెనెటిక్ ఇ-ఆటోను ఆదివారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందనంతో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుండడంతో కాలుష్య రహిత కెనెటిక్ ఇ-ఆటోను రూపొందించారు. కెనెటిక్ గ్రీన్ కంపెనీ (ఎలక్ర్టిక్ ) ఈ ఇ- ఆటోలకు రూపకల్పన చేసింది. ఈ ఆటోల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించవచ్చు. కాలుష్య నివారణకు ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.

E-Auto Innovation By Minister Koppula Eshwar