Home రాష్ట్ర వార్తలు హైకోర్టులో ఇ-కోర్టు

హైకోర్టులో ఇ-కోర్టు

ప్రారంభించిన సుప్రీం న్యాయమూర్తి    జస్టిస్ లోకూర్

ecourtహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో తొలి ఇ-కోర్టు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం హైకోర్టు ప్రాంగణంలో ఇ-కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకూర్ మాట్లాడుతూ, గత మూడు నాలుగేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయని, సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులోకి వచ్చిందని, ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని కక్షిదారులకు వీలైనంత మేర సత్వర న్యాయం చేసేందుకు న్యాయ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్ డేటా ఎంట్రీని వేగంగా పూర్తి చేయాల్సి ఉందని సూచించారు. ఈ విషయంపై న్యాయధికా రులు దృష్టి పెట్టాలన్నారు. దేశంలోని అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టుల లోనూ ఇ- కోర్టులను విరివిగా ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు నిర్ణ యించిందని, ఇందుకోసం ఇ- సిబ్బందిని కేటాయించాల్సిన అవస రం ఉఁదని గుర్తించామన్నారు. చాలా కేసులు ఏళ్ళ తరబడి కోర్టు విచారణలో ఉంటున్నాయని, ఫలితంగా కక్షిదారులకు సత్వర న్యా యం జరగడం లేదన్నారు. వీలైనంత తొందరగా కక్షిదారులకు న్యా యం చేయాలన్నదే సుప్రీంకోర్టు లక్షమని వెల్లడించారు. ముంబై, చండీఘడ్ కోర్టుల పూర్తి కంప్యూటరీకరణతో సాగుతున్నాయని, ఫలితంగా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేందుకు దోహదప డుతోందన్నారు. కంప్యూటరీకరణ ద్వారా కేసుల దర్యాప్తు, పురోగతి తదితర వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వీలు కలుగు తుందన్నారు. కోర్టులలో డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా చేపడుతు న్నామన్నారు. కోర్టులలో విడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జైలు సిబ్బందికి కొంత వెసులుబాటు లభించిందని, కీలక నిందితుల విచారణలో ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. నిందితులను కోర్టుకు తీసుకు రావడం, తిరిగి భద్రంగా తీసుకు వెళ్ళడం జైలు సి బ్బందికి ఒక్కో సారి ఇబ్బంది కలిగించే విషయమన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటిగ్రేటెడ్ కోర్టులు రాను న్నాయన్నారు.
హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలిప్ సి భోస్లే మాట్లా డుతూ, నూతనంగా ప్రారంభించిన ఇ-కోర్టుతో కేసుల విచారణ వేగవంతంగా సాగడంతో పాటు పేపర్ వినియోగం ఏ మాత్రం ఉండ బోదని, విచారణ ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ కానుందని వివరిం చారు. ఇప్పటికే హైకోర్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్, ఎస్‌ఎంఎస్ అలర్ట్, ఏ రోజు ఏ కేసు విచారణకు రానుందన్న విషయాలను వెబ్ సైట్‌లో పొందుపరచడం, న్యాయమూ ర్తులందరికి ల్యాప్‌టాప్‌లను అందించడం జరిగిందన్నారు. డిజిటలై జేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జ్యుడిషియల్ సిబ్బందికి ఎన్‌ఐటి ద్వారా శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి, సి. ప్రవీణ్ కుమార్‌రెడ్డి, రమేష్ రంగనాథన్, పి.వి.సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.