Home నిజామాబాద్ e-ఆహ్వానం

e-ఆహ్వానం

e-invitationవేడుకలు, శుభకార్యాలకు ఆన్‌లైన్ ఆహ్వానం
ఆచారానికి బై బై .. అంతర్జాలానికి అగ్ర తాంబూలం

కంప్యూటర్, ఫోన్ ఉండి, నెట్ కనెక్షన్ ఉంటే చాలు వాట్సప్, ఫేస్ బుక్, మెసెంజర్ లాంటి వాటితో ఎలాంటి సమాచారమైనా ఇవ్వవచ్చు. ఈ విధానంతో తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆహ్వానించడం, పిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అందరు దీనిపై ఆసక్తి కనుబరుస్తున్నారు. ఒకప్పుడు వివాహానికి, గృహప్రవేశానికి.. తదితర శుభకార్యాలకి ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రికలు బహుమతులు ఇచ్చి బొట్టు పెట్టి శుభ కార్యానికి రావాలని ప్రత్యేకించి చెప్పేవారు. కాని నేటి యాంత్రిక యుగంలో అంతా హైటెక్.. సాంకే తికం.. అంతర్జాలం పై ఆధారపడింది. ఇది నేటి ఫ్యాషన్.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో ప్రతీ ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఎస్‌ఎంఎస్‌ల జపం..
ఇటీవల కాలంలో ఎవ్వరిని చూసినా ఫేస్‌బుక్, ట్విట్టర్ల జపం చేస్తున్నారు. తమ మనసులోని భావాలను ఆ రెండు వేదికల ద్వారా పంచుకుంటున్నారు. మరో వైపు పార్టీలు, విందులకు ఆహ్వానించేందుకు వాట్సాప్, మెసెంజర్, సంక్షిప్త సందేశం ( ఎస్ ఎం ఎస్) లాంటి వాటినీ సద్విని యోగం చేసుకుంటున్నారు. ఒక్క సారి పోస్టు చేస్తే చాలు తమను అనుసరించే వారందరికీ సమాచారం అందుతుంది.

జిల్లాలో అనేకం ..
పలు ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లు, అధికారులు ఎస్ ఎం ఎస్ ద్వార ఉన్నతాదికారులకు సమాచారం పంపి సెలవు తీసుకుంటున్నారు. ఆకోవలోకే అనేక మంది ఉద్యోగులు తోటి ఉద్యోగులకి ఎస్ ఎం ఎస్ సమాచారం ఎప్పటికప్పుడు తాజా విషయాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో సామాజిక మాధ్యమాలను వినియోగించడం గతం లోనే ప్రారంభమైంది కాని ఈ మధ్య నగర వాసులు, యువకులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్‌లలో సుమారు 12 లక్షల కుటుంబాలు ఉండగా ప్రతీ 5 కుటుంబాలలో ఒకరు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇంచు మించు ప్రతీ ఇంటిలో జరిగే కార్యాక్రమాలను ఫేస్ బుక్ ట్విట్టర్ల ద్వార, అంతర్జాలం ద్వార తెలియజేస్తున్నారు. ఆఖరికి చదువుకోక పోయినా పేస్ బుక్ ద్వారా సమాచారాన్ని ఐ ఎం ఓ ద్వారా విడియో, చిత్రాలను ఇతరులకు షేర్ చేస్తున్నారు.

అధిక వాడకం అనర్థమే..
అధునాతన పరిజ్ఞానం ద్వారా లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతీదానికీ ఫోన్‌లు, కంప్యూటర్‌ర్లపై ఆధారపడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.