Home రాజన్న సిరిసిల్ల రాజన్న ఆలయంలో ఈ- టికెట్ విధానం

రాజన్న ఆలయంలో ఈ- టికెట్ విధానం

rajanna-tempul-image

సాంకేతిక నిపుణులతో సమావేశమైన ఆలయ 

మనతెలంగాణ/వేములవాడ: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఈ టికెట్ విధానాన్ని అమలు చేసేందుకు సాంకేతిక నిపుణులతో ఆలయ ఇఒ దూస రాజేశ్వర్ శుక్రవారం స మావేశమయ్యారు.
అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈటికెట్ విధానాన్ని ఆమలు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే జరిగిన సమావేశంలో వెల్లడించారన్నారు. ఇందులో భాగంగా రా ష్ట్ర ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ విభాగం ప్రాజెక్టు మేనేజర్ రుషిత, ఆడెపు రాజేశ్‌లతో ఆలయంలో జరిగే నిత్యపూజ లు, అద్దెగదుల నిర్వహణ, ప్రసాదాల విక్రయాల పై వివ ంచామన్నారు.
ప్రత్యేక స్టాప్‌వేర్‌ను రూపొందించిన అనంతరం ఆలయంలో ఈ టికెట్ విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.తద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకు ండా ఉండడమే కాకుండా వచ్చే భక్తులు స్వామివారి నిత్య సేవల్లో పాల్గొనే వివరాలను ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వీలు కూడా ఉంటుందన్నారు. త్వరలోనే ఈ టికెట్ విధానాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తామన్నారు.