Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇవే బిల్లు యంత్రాంగానికి జిఎస్‌టి కౌన్సిల్ ఓకే!

jaitly

జూన్ 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: వ్యత్యాసాలను తొలగించే యత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇవే బిల్లు యంత్రాంగాన్ని జూన్ 1 నుంచి అమలుచేయాలని వస్తు,సేవల పన్ను మండలి(జిఎస్‌టి కౌన్సిల్) శనివారం నిర్ణయించింది. ఆదాయపు పన్ను(ఐటి) నెట్‌వర్క్ సంసిద్ధతను సమీక్షించిన అనంతరం జిఎస్‌టి కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇవే బిల్లు విధానం కింద రూ. 50,000 విలువకన్నా ఎక్కువ విలువచేసే వస్తువులకు ఆన్‌లైన్‌లో ముందుగానే రిజిష్టరు చేసుకుని ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన 24వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశం విడియో కాన్పరెన్సింగ్ ద్వారా జరిగింది. ఇవే బిల్లు విధానం అమలుకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంసిద్ధతను సమీక్షించాక దేశవ్యాప్తంగా దీనిని అమలుచేసే విధానంపై చర్చించారని అధికారిక ప్రకటన పేర్కొంది.
‘దేశవ్యాప్తంగా ఇవే బిల్లు అమలును సంసిద్ధంచేసేంత వరకు రాష్ట్రాలు తమ స్వంత ఇవే బిల్లు విధానాలనే కొనసాగించుకోవచ్చు’ అని కూడా ఆ ప్రకటన పేర్కొంది. ఏదిఎలా ఉన్నా అంతరాష్ట్ర వస్తు రవాణాలో అనవసర కష్టాలు ఎదురవుతున్నాయిని వాణిజ్య, రవాణా ప్రతినిధులు విన్నవించుకున్నారు. ఇవే బిల్లు అవసరం దృష్టా దానిని వీలైనంత ఇవే బిల్లు విధానాన్ని దేశంలో తేవలసిందిగా వారు కోరారు. దేశవ్యాప్తంగా ఇవే బిల్లు విధానం సంసిద్ధమవుతుందని, దానిని 2018 జనవరి 18 నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి తేనున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. వాణిజ్యవేత్తలు, ట్రాన్స్‌పోర్టర్లు ఈ ఇవే బిల్లు విధానాన్ని స్వచ్ఛందంగా జనవరి 16 నుంచి ఉపయోగించడం మొదలెట్టవచ్చు. దీని తర్వాత దేశవ్యాప్తంగా ఇవే బిల్లు అమలుకు సంబంధించిన నియమాలు రానున్నాయి. 2018 ఫిబ్రవరి 1 నుంచి అంతర్రాష్ట్రాల మధ్య సరకు రవాణాకు ఇది తప్పనిసరి కానుంది. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరకు రవాణాకు ఒకే విధానాన్ని తేనుంది.
పన్ను ఎగవేత లొసుగులను అరికట్టడానికి జిఎస్‌టి పాలనలో ఇవే బిల్లు యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు. ఆదాయం సేకరణ తగ్గిపోవడానికి పన్ను ఎగవేతే కారణమని ప్రభుత్వం అక్టోబర్‌లో ఉటంకించింది. కొత్త పరోక్ష పన్ను విధానాన్ని జులై 1 నుంచి అమలు చేశాక ఆదాయం చాలా తక్కువకు పడిపోయింది. అక్టోబర్‌లో జిఎస్‌టి ఆదాయం రూ.న 83,346 కోట్లు ఉంది. ఇది సెప్టెంబర్ ఆదాయం రూ. 95,131 కోట్లకన్నా కూడా తగ్గిపోయింది. ‘రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రం లోపల సరకు రవాణాకు ఇవే బిల్లులు జనవరి 16 నుంచి తయారు చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రాల మధ్య సరకు రవాణాకు ఇవే బిల్లు విధానాన్ని 2018 జూన్ 1 కన్నా ముందు ఎప్పుడైనా అమలుచేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రంలోపల సరకు రవాణాకు ఇప్పటికే ఇవే బిల్లు విధానం కొన్ని రాష్ట్రాలకు ఉంది. ఆ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సరకు రవాణాకు ఈ విధానాన్ని ముందుగానే అనుసరించే అవకాశం ఉందని తెలిపింది. అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల ఇవే బిల్లుల ద్వారా రవాణా 2018 జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకేలా ఉండనున్నది. ఇవే బిల్లు విధానం యంత్రాంగం పన్ను అధికారులకు సాయపడ్డమేకాకుండా చెక్‌పోస్ట్‌లలో ఆలస్యం లేకుండా సరకు రవాణా వేగంవంతంగా జరగడానికి తోడ్పడగలదని డెల్లాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఆర్. మురళీధరన్ అభిప్రాయపడ్డారు. ఇది డీలర్లకు కూడా ఉపయోగకరంగా ఉండగలదని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం సాధారణం కానున్నదన్నారు.

Comments

comments