Home జనగామ సంక్షేమ ప్రభుత్వం టీఆర్‌ఎస్

సంక్షేమ ప్రభుత్వం టీఆర్‌ఎస్

 Each farmer has 5 lakh insurance Scheme

మన తెలంగాణ/ బచ్చన్నపేట : టీఆర్‌ఎస్ ప్రజా సంక్షేమ ప్రభుత్వమని జనగామ ఎమ్మేల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పోచన్న పేటలో వంటగది, ఆరోగ్యకేంద్రాలను ఆయన ప్రారంభించి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ది పథకాలు లభించాయన్నారు. కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే కరువు ప్రాంతాలపై కరుణచూపి గోదావరి జలాలతో చెరువులను నింపి పెద్దఎత్తున పంటలు పండేందుకు కృషి చేశారన్నారు. ప్రజలకు సాగు,త్రాగు నీరుతో పాటు రైతుబంధు పథ కం ప్రవే శపెట్టి పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి రైతుకు 5లక్షల బీమాసౌకర్యంతో పాటు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లాకన్వీనర్ ఇర్రిరమణారెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి, బొడిగం చంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేకల రంగారెడ్డి, బేజాడి సిద్దు లు,సర్పంచ్ కాంసానిమమత, ఎంపీటీసీ సుజాతలు పాల్గొన్నారు.