Home తాజా వార్తలు జులై 9న ఎంసెట్-2

జులై 9న ఎంసెట్-2

Laxma-Reddy-హైదరాబాద్ : ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్ల ప్రవేశాల కోసం ఈనెల 28న ఎంసెట్-2కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. జులై 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ వాయిదాపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం విసి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్-2కు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి విడుదల చేశారు.