Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పత్తి, పండ్ల తోటలకు రెండు పంటల కింద రాయితీ ఇవ్వాలి: ఏనుగు

Ravinder-Reddy

హైదరాబాద్: అసెంబ్లీలో మంగళవారం ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రైతును రాజును చేయాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయమని టిఆర్ఎస్ ఎంఎల్ఎ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రశంసించారు. ఆయన శాసన సభలో మాట్లాడుతూ…. భూప్రక్షాళన ప్రక్రియ వివరాలు తెలియజేయాలని కోరారు. అంతర పంటలకు పెట్టుబడి రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండ్ల తోటలకు రెండు పంటల కింద పెట్టుబడి రాయితీ వర్తిస్తుందా లేదా అనేది ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను దేశం మొత్తం అదర్శంగా తీసుకోబోతుందని కొనియాడారు. రైతులకు బ్యాంక్ చెక్‌లు ఇస్తారా లేరా ఎకౌంట్ పే చెక్‌లు ఇస్తారా అని ప్రభుత్వాన్ని అడిగారు. పత్తి కూడా రెండు పంటల కింద రాయితీ ఇవ్వాలని కోరారు.

Comments

comments