Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భూకంపం… రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7

earthquake-logo1టోక్యో: జపాన్‌లో దక్షిణ ప్రాంత ద్వీపం ఒకినావలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒకినావతో పాటు ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు. ఒకినావ తీరంలో 40 కిలో మీటర్ల సముద్రం లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఒకినావలో భూకంపం వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత జపాన్ ఉత్తరప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి.

Comments

comments