Search
Friday 16 November 2018
  • :
  • :

భవన నిర్మాణానికి భూమి పూజ

Building

వనపర్తి ప్రతినిధి : మండల పరిధిలోని నాగవరం గ్రామ శివారులో విశ్రాంత ఆర్టీసి ఉద్యోగుల నూతన భవన నిర్మాణానికి బుధవారం రాష్ట్రప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.  అనంతరం  విశ్రాంతి ఆర్టీసి ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత రెండు నెలల క్రితం ఆర్టీసి కాలనీలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో విశ్రాంతి ఉద్యో గులు భవన నిర్మాణం కోసం తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తప్పకుండా భవన నిర్మాణానకి సహాయపడు తానని హామి ఇవ్వడం జరిగిందని బుధవారం భూమి పూజ కార్యక్రమంలో  విశ్రాంతి ఉద్యోగుల కోసం నిర్మించే భవన నిర్మాణానికి తన వంతుగా రూ. 5లక్షల చెక్కును పంపి ణీ చేయడంతో పాటు భవనంపై ఇంకొక ప్లోర్ వేసుకోవడానికి కూడా సహాయం చేస్తానన్నారు.

విశ్రాంతి ఉద్యోగులు భవనంలో కంప్యూటర్‌లను ఏర్పాటు చేసుకుని ఇంటర్‌నెట్ ద్వారా సమాజాని కి ఉపయోగపడే అంశాలను గుర్తించి నేటి యువ తకు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. హై ద్రాబాద్ రవీంద్రభారతిలో ఆర్టీసి విశ్రాంత రాష్ట్ర అధ్యక్షులతో ఆర్టీసిలో నెలకొన్న సమస్యలపై మా ట్లాడడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అనం తరం విశ్రాంతి ఆర్టీసి ఉద్యోగులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి భగ వత్‌గీతను బహుకరించారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్ర మంలో ఎంపిపి శంకర్‌నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ బి లక్ష్మయ్య, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, లోక్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేష్, కాగితాల లక్ష్మీనా రాయణ, నాయకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, విశ్రాంతి ఆర్టీసి ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

comments