Home అంతర్జాతీయ వార్తలు పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం

Earthquakeపపువా న్యూ గినియాలో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. రాబౌల్‌లో 7.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. సునామీ వచ్చే  సూచనలు లేవని వారు వెల్లడించారు. అయితే ఈ భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. భూకంపం చాలా బలంగా వచ్చింది. దీంతో రాబౌల్ నగరం ఊగిపోయింది. రాబౌల్‌కు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు  అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కానీ పపువా న్యూగినియా విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని తెలిపింది.

Earthquake at Rabaul In Papua New Guinea