Home తాజా వార్తలు హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

Himachal-Pradesh

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్‌మౌర్‌లో సోమవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా ఉందని భూపరిశోధన అధికారి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు స్థానిక ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియలేదు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది.

హిమాచల్ ప్రదేశ్ లో బీభత్సం సృష్టిస్తున్న తుపాను, భారీ వర్షాలు

మరో వైపు హిమాచల్‌ప్రదేశ్‌లో మంచుతుపాను, భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రావి నదీ పరివాహక ప్రాంతాలు ఆకస్మికంగా వరదల్లో చిక్కుకున్నాయి. ప్రవాహాల్లో బస్సులు, లారీలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. అనేక జలాశయాలు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలంవెళ్లదీస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రవాప్తంగా పలు జాతీయ రహదారులు మూసివేశారు.

earthquake in Himachal pradesh

Telangana news