Home అంతర్జాతీయ వార్తలు ఆస్ట్రేలియాలో భూకంపం… సునామీ హెచ్చరికలు

ఆస్ట్రేలియాలో భూకంపం… సునామీ హెచ్చరికలు

సిడ్నీ: ఆస్ట్రేలియా సమీపంలోని లాయల్టీ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం వచ్చింది. భూకంప లేఖినిపై తీవ్రత 7.5గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. సునామీ వచ్చే అవకాశం ఉందని ఆస్టేలియా ప్రభుత్వం హెచ్చరకలు జారీ చేసింది. భారత తీర ప్రాంతానికి ఎలాంటి హెచ్చరకలు జారీ చేయలేదని ఇన్‌కాయిస్ సంస్థ వెల్లడించింది. లాయల్టీ దీవు నుంచి 153 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, 16 మైళ్ల లోతులో నాభి ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లొద్దని జియోలాజికల్ శాస్త్రవేత్తలు సూచించారు. లాయల్టీ తీర ప్రాంతాలలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు.