టోక్యో : జపాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో ఒకాసా నగరం ఒక్కసారిగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంపంతో పలు ప్రాంతాల్లో భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా ముగ్గురు చనిపోయారు. డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. ఒక్క ఒకాసాలోనే నలబై మందికి పైగా గాయపడ్డారు. భూకంపంతో దేశంలో బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. ఈ రైలు సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.