Home జాతీయ వార్తలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూకంపం

earthquake-logo1నెల్లూరు : నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు మండలాలతో పాటు వింజమూరు మండలంలోని చాకలికొండ, బత్తినివారిపల్లె, వూటుకూరు, గుండెమడకల తదితర గ్రామాల్లో ఉదయం 8.40 సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భారీ శబ్దాలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్ల గోడలు బీటలు వారాయి. ప్రకాశం జిల్లా లింగసముద్రలోనూ భూమి స్వల్పంగా కంపించింది.