Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఉత్తర భారత్‌లో భూకంపం

Earthquake in northern India

ఢిల్లీ : అఫ్గానిస్థాన్ – పాక్ సరిహద్దులోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూ కంప తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావం ఉత్తర భారత్‌పై కూడా పడింది. కశ్మీర్‌తో పాటు ఉత్తర భారత్‌లోని పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీ, గుడ్‌గావ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Earthquake in Northern India

Comments

comments