హరియాణా : సోనిపట్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4గా నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల , ఆఫీసుల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం మళ్లీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.