Home అంతర్జాతీయ వార్తలు తైవాన్‌లో భూకంపం

తైవాన్‌లో భూకంపం

Earthquakeతైపీ : తైవాన్ రాజధాని తైపీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. తైపీకి 60 కిలోమీటర్ల దూరంలోని యిలాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై వీధుల్లోకి పరుగెత్తారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తైవాన్‌లో గత ఫిబ్రవరిలోనూ భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో తైవాన్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ కుప్పకూలి 117 మంది చనిపోయారు.