Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సంస్కరణల అమలులో రాష్ట్రానికి వందశాతం స్కోర్

bisnis

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ అసెస్ మెంట్ 2018 కార్యక్రమంలో భాగంగా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకులను డిఐపిపి కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్టాలు మరో సారి సత్తా చూపించాయి. ఈ ర్యాంకుల్లో ఎపి తొలిస్థానం సాధించగా… తెలంగాణ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్ నిలవగా… గుజరాత్  ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. సంస్కరణల అమలులో 100 శాతం మార్కులను తెలంగాణ, ఎపి, జార్ఖండ్, గుజరాత్ సాధించాయి. సంస్కరణల అమలులో 9 రాష్ట్రాలు 95 శాతం పైగా స్కోర్ సాధించగా.. 6 రాష్ట్రాలు 90-95 శాతం స్కోర్, 3 రాష్ట్ర్రాలు 80-90 శాతం, 18 రాష్ట్రాలు 80 శాతం లోపు స్కోర్ సాధించాయి. 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ‘టాప్ అచీవర్స్’ గా గుర్తించాయి. 90-95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ‘అచీవర్స్’ గా గుర్తింపు లభించింది. 80-90 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ‘ఫాస్ట్ మూవర్స్’ గా, 80 శాతంలోపు ఉన్న రాష్ట్రాలను ‘ఆస్పైరర్స్’ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించింది.

 

Comments

comments