Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆ హోటల్‌లో ఎంతైనా తినండి.. బిల్లు మాటెత్తరు!

Eat-for-free-in-Kerala-Rest

తిరువనంతపురం: ఆ హోటల్‌లో ఎంత తిన్నా బిల్లు మాటేత్తరు అక్కడి నిర్వహకులు. ఇదేదో తమాషాకు చెబుతున్న మాట కాదు. నిజంగానే నిజం చెబుతున్నామండీ బాబు. కేరళలో ప్రారంభమైన ఈ హోటల్ ఇప్పుడు అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకా చెప్పాలంటే హాట్‌టాపిక్‌గా మారింది. పేరులో ఉన్నట్టుగా పీపుల్స్ రెస్టారెంట్ అంటే పూర్తిగా ప్రజలే కోసమే అన్నట్టుగా దీనిని నడిపిస్తున్నారు. ఎంతోమంది ఆకలిని తీరుస్తున్న ఈ హోటల్ కేరళలోని అళపళ ప్రాంతంలో అలప్పుఝా-చెర్తాల జాతీయ రహదారి సమీపంలో పాతిరాపల్లిలో ఉంది. ఉదయం టిఫిన్లు మొదలుకొని భోజనం కూడా దొరుకుతుంది. మీరేంత తిన్నా ఎవరూ బిల్లు అడగరు. కౌంటర్ దగ్గర ఓ బాక్సు ఉంటుంది. అందులో మీకు ఎంత తోస్తే అంత వేయ్యొచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే ఏమీ ఇవ్వకున్న పర్వాలేదట. ప్రస్తుతం ఇక్కడ ప్రతి రోజూ 1000 మందికి సరిపోయే ఆహార పదార్థాలను వండుతున్నారట. ఇక వంటలకు అవసరమైన కూరగాయలను కూడా హోటల్ ఆవరణలో గల 2.5 ఎకరాల స్థలంలో సేంద్రీయ పద్ధతుల్లోనే పండిస్తున్నారట. ఈ రెస్టారెంట్‌ను స్నేహజలకం అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వాహణ మొత్తం దాతల నుంచి అందే విరాళాలతోనే జరగుతుంది. రెస్టారెంట్ భవనం కూడా దాతలే కట్టించారట.

Comments

comments