Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నట్స్ తినండి… నాజూగ్గా ఉండండి

nutsమన శరీర రక్షణకు, అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు నట్స్‌లు ఎంతో ఉపయోగపడుతాయి. కొన్ని రకాల గింజలను తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. బాదం, వాల్‌నట్, జీడిపప్పు, ఖర్జూర, అంజీర, అఫ్రికాట్, ఫిస్తాతో పాటు అవిశ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు వంటివి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి.
బాదం పప్పు : బరువు తగ్గుటకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది. చెడు కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
వాల్‌నట్ : బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ లెవెల్స్‌ను పెంచుతుంది. టైప్2 మధుమేహాన్ని అదుపులోకి ఉంచుతుంది.
జీడీపప్పు : రక్తపోటు తగ్గిస్తుంది. కాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడుతుంది. ఎర్ర రక్తకణాలను పెంపొందిస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రిను మెరుగుపరుస్తుంది.
ఖర్జూర : కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కండరాలను బలంగా చేస్తుంది. తక్షణ శక్తిని కలుగజేస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. అలసటను దూరంగా ఉంచుతుంది.
అంజీరః హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. సెక్సువల్ డిజార్డర్స్‌ను సరిచేస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. కంటిచూపును రక్షిస్తుంది.
ఆఫ్రికాట్ : ఇన్‌ప్లమేషన్ నుండి కాపాడుతుంది. విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాక కావలసిన పైబర్స్ పుష్కలంగా వున్నాయి., కంటిచూపును రక్షిస్తుంది. కండరాలను బలంగా చేస్తుంది.
పిస్తాషియోస్ : హిమోగ్లోబిన్‌ను పెంపొందిస్తుంది. చర్మ సౌందర్యానికి, కళ్ళకు ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
అవిశగింజలు : కడుపునొప్పిని దూరం చేస్తుంది. బ్రెస్ట్ ప్రొస్టేట్ కాన్సర్‌ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా చేస్తుంది. మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు : అవసరం లేని ఫ్యాట్స్‌ని తీసేసి అవసరమైన ప్యాట్స్‌ని వుంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ని తగ్గిస్తుంది. ఆందోళనన డిప్రెషన్‌ను కంట్రోల్ చేస్తుంది.

Comments

comments