Search
Saturday 17 November 2018
  • :
  • :

తీసి పారేయొద్దు.. తింటేనే మేలు ..!!

వంట చేసేటపుడు సాధారణంగా ప్రతిదీ తొక్కతీసి చేసేస్తుంటాం. కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కలో అధిక పోషక పదార్థాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  కాకపోతే ఉపయోగించే ముందు నీళ్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగడం మాత్రం మర్చిపోవద్దు.  తొక్కపై ఉండే రసాయనాలు పూర్తిగా పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

lvegetable

వంట గదిలో ఎప్పుడూ సమృద్ధిగా ఉండేవి ఆలూ. ఆలూ దుంపలపై ఉండే తొక్కలో విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్ పోషకాలుంటాయి. పరోటాలాంటివి చేసేటపుడు పొట్టుతీయకుండా చేసుకుంటే సరి.

గుమ్మడి కాయ తొక్కలో శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూసే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ.
సాధారణంగా పుచ్చకాయను ఎర్రగా ఉన్నగుజ్జును తింటాం. అడుగున ఉండే తెల్లటి పదార్ధంలో సెట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటవిన్లు సి, ఎ, థయామిన్, రైబోప్లెవిన్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియంలాంటివి ఉంటాయి. జ్యూస్ చేసేటపుడు వీటిని లోతుగా కట్‌చేసి చేసుకోవచ్చు.
యాపిల్ తొక్కులో రొమ్ము, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లను నయం చేసే శక్తి ఉంది. యాపిల్ జ్యూస్ కన్నా పండు తినడమే మంచిది. చిగుళ్ల సంరక్షణకు తోడ్పడే పాలీఫినాల్స్ ఎక్కువ ఈ పండులో.
జామ తొక్కలో యాంతో సియానిస్ అనే క్యాన్సర్ నియంత్రణ కారకం ఉంది.
నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.
బీరకాయ పొట్టులో పోషకాలు అధికం. దాని నుంచి లభించే పీచు మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బీరకాయ, సొరకాయ, లేత అరటికాయల పొట్టుతో పచ్చళ్లు చేసుకోవచ్చు.
దోస తొక్కులో పీచు ఎక్కువ. విటమిన్ ఎ, బీటాకెరోటిన్‌లు ఉన్నాయి.
చిలగడదుంప పొట్టులో రక్తహీనతను తగ్గించే ఇనుము,వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్ పోషకాలున్నాయి.

Comments

comments