Home తాజా వార్తలు చేపలతో వ్యాధులకు చెక్…

చేపలతో వ్యాధులకు చెక్…

 Eat too much of the fish is good for health

లండన్: చేపలను అధికంగా తింటే అకాల మరణాల ముప్పు 40 శాతం వరకూ తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. చేపల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ముప్పు ఉండదని గతంలో తెలిసిన విషయం . అయితే తాజా అధ్యయనంలో చేపలను తరచూ తీసుకునే పురుషుల్లో కాలేయ వ్యాధులతో మరణించే ముప్పు 37 శాతం తగ్గుతుందని , అల్జీమర్స్ కారణంగా మహిళల్లో మరణాల ముప్పు 38 శాతం తగ్గుతుందని తేలింది. చైనాకు చెందిన జెజాంగ్‌ యూనివర్సిటీ 16 ఏళ్ల పాటు  2,40,700 మంది పురుషులు, 1,80,500 మంది మహిళల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది.