Home లైఫ్ స్టైల్ ఉడికీ ఉడకని చికెన్ తింటే పక్షవాతమే…

ఉడికీ ఉడకని చికెన్ తింటే పక్షవాతమే…

Half Cooked Chicken

సరిగ్గా ఉడకని చికెన్ తిన్న మానవులు పక్షవాతానికి గురవుతారని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. ఉడికీ ఉడకని చికెన్ గ్యూలియన్ బర్రీ సిండ్రోమ్ (GBS)కు దారితీస్తుందన్నారు. జిబిఎస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇది మానవుల్లో న్యూరోమస్కలర్ పెరాలసిస్ రావడానికి కారణమౌతుందంటున్నారు.

ఇది ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. చికెన్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉడికించకపోయినట్లయితే దాంట్లో కేంపైలోబ్యాక్టర్ జెజునీ అనే బ్యాక్టీరియా చేరుతుందని పరిశోధకుల బృంద నాయకుడు, మిచ్‌గాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. లిండా మేన్‌ఫీల్డ్ వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ ఈ పక్షవాతం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం ఉండదన్నారు. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అవి పనిచేయకుండా పోతాయి. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు వాంతులు, అతిసారంతో బాధపడుతుంటారు. కాళ్లు చేతులు బలహీనపడి క్రమంగా అది పక్షవాతాని దారితీస్తుందని పేర్కొన్నారు.