Home నవ విజ్ఞానం ఎబోలా, జికా, డెంగ్యూ వైరస్‌ల చికిత్సకు ఔషధ మార్గం

ఎబోలా, జికా, డెంగ్యూ వైరస్‌ల చికిత్సకు ఔషధ మార్గం

Ebola, Zika, Dengue Virus Treatment Drug Path

 

ఎబోలా, డెంగ్యూ,జికా వైరస్‌లు మనిషి శరీరంలో ఎలా ప్రవేశించి విస్తరిస్తున్నాయో వీటిని నివారించడానికి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో వివరిస్తూ రెండు పరిశోదన పత్రాలు జర్నల్ సెల్‌లో డిసెంబర్ 13న వెలువడ్డాయి. జార్జియా స్టేట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, గ్లాడ్‌స్టోన్ సంస్ధల ఆధ్వర్యాన ఈ జర్నల్ వెలువడుతోంది. వైరస్‌లకు, మానవ శరీరం లోని కణాలకు మధ్య ప్రొటీన్‌కు ప్రొటీన్‌కు ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఈ పరిశోధనల్లో వివరించారు. వీటి ఫలితంగా శక్తివంతమైన చికిత్సలు అణగారిపోతున్నాయి. మొదటి అధ్యయనంలో ఆరు ఎబోలా ప్రొటీన్లతో 194 వైరస్‌మానవ అనుసంధానాల మధ్య గల సంబంధాన్ని వివరించడమైంది. ఇది చివరకు ఎబోలా ప్రొటీన్ విపి30 కి, మానవ ప్రొటీన్ ఆర్‌బిబిపి6కు ఉన్న సంబంధాన్ని స్పష్టం చేసింది.

ఎబోలా ప్రొటీన్ విపి30ను మరో ఎబోలా ప్రొటీన్ ఎన్‌పిని ఒకదానితో ఒకటి అనుసంధానం కాకుండా మానవ ప్రొటీన్ ఆర్‌బిబిపి6 నివారిస్తుంది. మానవ శరీరం తనకు తాను ఎలా వైరస్ నుంచి రక్షించుకుంటుందో దీని వల్ల తెలుస్తోంది. ఫలితంగా ఎబోలా వైరస్ ప్రభావాన్ని నివారించ గలిగే ప్రొటీన్ ఆర్‌బిబిపి6 ని అనుకరించే ఔషధాల చికిత్సకు మార్గం చూపించినట్టయింది. మనం తరచుగా మానవ ప్రొటీన్లను అనుకరించే వైరల్ ప్రొటీన్ల ఆవిర్భావాన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్ర ం భిన్నంగా ఉంటుంది. సహజంగా మన శరీరం ఎబోలా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి గలిగి ఉంటుందని తేలింది. వైరస్ దాని దరిదాపులా ఎక్కడా చేరదు. ఇప్పటికీ ఎబోలా వైరస్‌ను నివారించ గలిగే పెద్ద వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కానీ ఈ ప్రొటీన్ లేకుంటే ఈ వైరస్ ప్రాణాంతకమవుతుందని పరిశోధకులు జ్యోతి బాత్రా చెప్పారు.

రెండవ పరిశోధన పత్రం
రెండవ పరిశోధన పత్రంలో శాస్త్రవేత్తలు డెంగ్యూ, జికా వైరస్‌లపై దృష్టి పెట్టారు. ఈ రెండూ దోమల వల్లనే వ్యాపిస్తుంటాయి. డెంగూ వైరస్‌తో దోమ వైరస్ అనుసంధానం కలిగి ఉంటుంది. మానవ వైరస్ ప్రొటీన్లతో ఇవి అనుసంధాన మవుతుంటాయి. ఈ రెండు వైరస్‌లలో ఒకే అనుసంధానాన్ని కనుగొన్నారు. వైరల్ ప్రొటీన్ ఎన్‌ఎస్4 ఎ, ఆతిధ్య ప్రొటీన్ ఎస్‌ఇసి 61 ఈ రెండూ అనుసంధానం కలిగి ఉంటాయి. ఎస్‌ఇసి 61ప్రొటీన్ గతంలో క్యాన్సర్‌కు చెందిన కొన్ని వ్యాధులతో అనుసంధానం కలిగి ఉండడం కనిపించింది.కాంపౌండ్లు ఈ ప్రొటీన్లను లక్షం చేసుకున్నప్పుడు మానవుల దోమల కణాలతో కలుస్తాయి. అవి డెంగ్యూ, జికా వైరస్‌లను తుడిచిపెడతాయి. తరువాత శాస్త్రవేత్తలు జికా వైరస్ మైక్రోసిఫలీని ఎలా సంక్రమింప చేస్తుందో పరిశీలించారు.

జికా ప్రొటీన్ ఎన్‌ఎస్ 4 ఎ మానవ మెదడు అభివృద్ధికి దోహదం చేసే ఎన్‌కెఎల్‌ఇ 2 అనే మానవ ప్రొటీన్‌ను ఎలా అదుపులో ఉంచుతుందో పరిశీలించారు. ఈ పరిశోధన వల్ల ఎన్‌కెఎల్‌ఇ 2 ను లక్షంగా చేసుకుని జికా వైరస్‌ను నివారించ గల ఔషధం అభివృద్ధి చేయడానికి మార్గం ఏర్పర్చినట్టయింది. ప్రస్తుతం ఎబోలా, డెంగ్యూ, జికా వైరస్‌లను నివారించే సరైన చికిత్సలకు కావలసిన డ్రగ్స్ అంటూ లేవు. ఎబోలా వైరస్ 1976లో మొదటిసారి బయటపడింది. ఇది సోకిన వారిలో 50 శాతం మంది మృతి చెందారు. కాంగోలో ఇది బయటపడి పశ్చిమ ఆఫ్రికాలో 2013నుంచి 2016 మధ్య కాలంలో విస్తరించి 28వేల మందిని బాధితులుగా చేసింది. వారిలో 11 వేలమంది మృతి చెందారు.జికా వైరస్‌పై 2016లో అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఉగాండా జికా అడవుల్లోని కోతులకు ఇది 1947లో సంక్రమించింది. 1952,2007 లో మనుషులకు సంక్రమించింది. ఇక డెంగ్యూ భారతదేశంలో నిరంతరం వ్యాపిస్తూనే ఉంది.

                                                                                                                 – సైన్స్ విభాగం

Ebola, Zika, Dengue Virus Treatment Drug Path

Telangana Latest News