Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఇవిఎంలతో సమస్యలు ఉన్నాయని చెప్పారు…

EC Chief OP Rawat Comments on EVMs

ఢిల్లీ : ఇవిఎంలు, వివిప్యాట్ మెషిన్లతో సమస్యలు ఉన్నాయని పలు రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసుకొచ్చాయని ఎన్నికల సంఘం చీఫ్ ఒపి రావత్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల సమగ్రతను మరింత పెంపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలత వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన సలహాలను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సక్రమంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

EC Chief OP Rawat Comments on EVMs

Comments

comments