Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నవాజ్ షరీఫ్‌కు మరో షాక్

EC Notices to Pak Ex PM Nawaz Sharif

కరాచీ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పనామా పత్రాల కేసులో అనర్హత వేటు పడి ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఆయన కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ ముస్లిం లీగ్‌లో ఎన్ అనే పేరు కోల్పోయే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హతకు గురైన వ్యక్తి పేరుతో రాజకీయ పార్టీ ఉండరాదని అవామీ తెహ్రిక్ నేత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసి షరీఫ్‌కు నోటీసులు జారీ చేసింది. జులై 9న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని లాహోర్‌లోని షరీఫ్ ఇంటికి ఇసి నోటీసులు పంపించింది. పాక్‌లో జులై 29న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో షరీఫ్‌కు ఇసి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనర్హత వేటు పడిన అనంతరం కూడా పార్టీ చైర్మన్‌గా షరీఫ్ కొనసాగేలా పిఎంఎల్ ఎన్ రాజ్యాంగ సవరణ చేసింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు కోర్టులో సవాల్ చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62,63 ప్రకారం అనర్హత వేటు పడిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉండరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో షరీఫ్‌కు ఉచ్చు బిగుసుకుంది. ఈ క్రమంలో ఆయన పార్టీకి కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

EC Notices to Pak Ex PM Nawaz Sharif

Comments

comments