Search
Friday 21 September 2018
  • :
  • :

ఎకో ఫ్రెండ్లీ స్టైల్!

Eco friendly startup system for furniture and interior design

ఇప్పటి యువత కాళ్లకి వేసుకునే షూ నుంచి కంటికి పెట్టుకునే అద్దాల వరకూ వారికి నచ్చిన ట్రెండీగా కనిపించే వాటిని ఎక్కవగా ఆకట్టుకుంటున్నారు. చిన్న చిన్న వస్తువలుకు సైతం క్షణాల్లో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. అందులో రోజు రోజుకి వస్తున్న గాడ్జెట్స్‌పై మారి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. వాటిలో సన్‌గ్లాసెస్‌పై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అందులో చాలా వరకు కంటికి సంబంధించిన సమస్యలు లేకపోయినా.. కేవలం స్టైల్‌గా కనిపించడానికి పెట్టుకుంటున్నారు. బైక్ డ్రై చేసేసమయంలో, ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఈ సన్ గ్లాసెస్‌ను ఉపయోగిస్తున్నారు. దానికితోడు ఎవరికి నచ్చిన కలర్స్‌లో ఫ్రేమ్‌లను రోజుకో దానిని మార్చుకుంటున్నారు. అలాంటి వారికి ఇప్పుడు కొత్తగా కళ్లద్దాలను చెక్కతో డిజైన్ చేసి ఫ్రేముని జతచేసి ‘టెవుడ్ కామ్’ ఎకోఫ్రెండ్లీ స్టార్టప్‌ని ఏర్పాటు చేశాడు తమిళనాడుకు చెందిన మామాని జయకుమార్…

విప్రోలో ఇంజనీర్‌గా పనిచేస్తుండగానే కొత్తగా ఏదైనా చెయ్యాలనే తపన జయకుమార్‌లో మొదలైంది. ఇప్పటి వరకూ భారతదేశంలో ఎవరూ చెక్కతో కళ్లద్దాల ఫ్రేములను తయారు చేయడంలేదని తెలుసుకున్నాడు. ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టాడు. మధ్యతరగతి కుటుంబం అయినా ఆన్‌లైన్ కంపెనీని ప్రారంభించడం ఓ పెద్ద సాహసమే. డబ్బులు లేని సమయంలో స్నేహితుని సహాయంతో చిన్నగా మొదలుపెట్టాడు. ఇప్పటి తరానికి తగ్గట్టుగా సరికొత్త డిజైన్లను రూపొందించి యువతను ఆకట్టుకుంటున్నాడు. టెటెవుడ్.కామ్ పేరుతో ప్రారంభించిన ఆన్‌లైన్ స్టోర్‌ను లాభాల బాట పట్టించాడు. ఒక్కడితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు పదుల సంఖ్యలో ఉద్యోగులకు జీవనాధారం అయింది. మొదట్లో ఈ కంపెనీపై ప్రజల్లో అవగాహన లేకపోయినా వాటిపై ఎలా వారికి నమ్మకం కలిగించాలో అతడికి అర్థంకాలేదు. అయినా వినియోగదారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పి, వారికి నమ్మకం కలిగించాడు. అప్పటి నుంచీ టెటెవుడ్ పేరు ఆప్టిక్ ఇండస్ట్రీలో మారుమోగడమే కాకుండా లక్షల్లో టర్నోవర్‌తో దూసుకుపోతోంది.

ఈ ఫ్రేములు ట్రెండీగా ఉండటమే కాకుండ ఎకో ఫ్రెండ్లీ కూడా. 80 గ్రా॥ కంటే ఇవి తక్కువ బరువుంటాయి. చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. అంతే కాదు, ఈ ఫ్రేమ్స్‌ని క్లీనింగ్ చేసుకోవడం కూడా సులభం. చెక్కతో కళ్లద్దాల ఫ్రేములు తయారు చేయడం ఇదే మొదటిది కావడంతో టెటెవుడ్ ఫ్రేమ్స్‌కి పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నాడు జయకుమార్. ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే కస్టమర్లు తీసుకొచ్చే చెక్కతోనూ అందమైన ఫ్రేములను తయారుచేసి ఇస్తారు. కేవలం చెక్క ఫ్రేములను తయారుచేయడమే కాదు వాటిపై పేర్లు, అందమైన ఆకృతులనూ జోడిస్తారు. ఈ ఫ్రేముల కనీస ధర రూ. 2500 ఆర్డర్ చేసిన రెండు రోజుల్లో డెలివరీ చేస్తారు. నిజానికి 8 గంటల్లో తయారు చేసినా, వివిధ పరీక్షల కోసం ఉంచి, ఆ తర్వాత కస్టమర్లకు అందచేస్తారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్‌లో ఇవి ఇప్పుడు లభిస్తున్నాయి. ప్రస్తుతం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్లాస్టిక్‌ని వాడకం మంచిది కాదంటున్నాడు. ఇందుకోసమే తానే తయారుచేస్తున్న ఈ టెటెవుడ్ సన్‌గ్లాసెస్‌లను చెక్కతో తయారుచేస్తున్నాడు మామాని జయకుమార్. మీరు కూడా ఒకసారి ఈ చెక్క కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చి మరింత ట్రెండీగా కనిపించండి.

Comments

comments