Home బిజినెస్ 70కి చేరిన రూపాయి విలువ

70కి చేరిన రూపాయి విలువ

Rupee may weaken to Rs 70/$ in 2018

న్యూఢిల్లీ: టర్కీలో ఆర్థిక సంక్షోభం భారత్ కరెన్సీని కూడా దెబ్బతీస్తోంది. టర్కీ కరెన్సీ లిరా కుప్పకూలడంతో సోమవారం భారీగా పడిపోయిన రూపాయి మరోసారి చతికిలపడింది. చరిత్రలో తొలిసారి 70 మార్క్ దిగువకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.08 పైసల వద్ద అత్యంత కనిష్ఠానికి చేరింది. ఆఖరికి రూ.69.93 పైసల వద్ద ముగిసింది. అయితే బహ్య కారణాల వల్లే రూపాయి పతనమవుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్ది రోజుల్లో రూపాయి సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం అభయమిస్తోంది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 69.77 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి 69.71- నుంచి 70.10 మధ్య శ్రేణిలో కదలాడింది. 2013 నుంచి రూపాయి ఒక రోజు అతిపెద్ద పతనం ఇదే. మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి, డాలర్‌తో మారకం రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే.  చైనా, యూరోపియన్ దేశాలతో వాణిజ్య వివాదాలకు తెరతీసిన అమెరికా ప్రభుత్వం గత వారం టర్కీ దిగుమతులపై దృష్టి పెట్టింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేయడంతో టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ భారీగా పతనమైంది.