Home అంతర్జాతీయ వార్తలు బ్రెగ్జిట్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వినాశనమే: ట్రంప్

బ్రెగ్జిట్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వినాశనమే: ట్రంప్

Donald-Trump-Head

లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహం అమెరికా, బ్రిటన్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ వ్యూహానికి సంబంధించిన శ్వేత పత్రాన్ని(వైట్ పేపర్)ను గురువారం వెల్లడించింది. ఆ వ్యూహం వివాదాస్పదంగా మారింది. దానిని వ్యతిరేకిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్, విదేశాంగ మంత్రి బోరిసష్ జాన్సన్ సహా ఇద్దరు సీనియర్ క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. కాగా థెరెసా మే బ్రెగ్జిట్ ప్రణాళికలను తాజాగా ట్రంప్ కూడా విమర్శించడం మొదలెట్టారు.

‘వారు ఒకవేళ అలాంటి ఒప్పందం చేసుకుంటే, మేము కూడా బ్రిటన్‌కు బదులు ఐరోపా యూ నియన్‌తోనే ఒప్పందం చేసుకుంటాం. దీనివల్ల అమెరికా, బ్రిటన్‌ల ద్వైపాక్షిక వా ణిజ్య ఒప్పం దం నశిస్తుంది’ అని ట్రంప్ ‘సన్’ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. తాను థెరెసాకు బ్రెగ్జిట్‌తో ఎలా వ్యవహరించాలో చెప్పానని, కానీ ఆమె తన మాట వినలేదని, పైగా వేరే మార్గాన్ని ఎంచుకుందని ట్రంప్ చెప్పారు. ప్రస్తు తం డొనాల్డ్ ట్రంప్ లండన్‌లో తన తొలి అధికారిక పర్యటనలో ఉన్నారు. కాగా ‘సన్’ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వూ కారణంగా ట్రంప్ ఇంగ్లాండ్ పార్లమెంటు సభ్యుల విమర్శలను ఎదుర్కొంటున్నారు.