Search
Wednesday 17 October 2018
  • :
  • :

టిఆర్‌ఎస్‌తోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం.

11VMD-P01

వేములవాడ: టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అన్ని కులాల ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. బుధవారం మండల మాల జంగం సంఘం వారు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రమేష్‌బాబు గారిని మర్యాదపూర్వకంగా ఆయన స్వగృహంలో కలిసి, ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ అన్ని కులాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా నిలదొ క్కుకోవడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆరే సత్యనారాయణ మాట్లాడుతూ 60 ఏండ్లలో మమ్మల్ని పట్టించుకున్న నాథుడు లేడని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి మా కులానికి ఇచ్చిన పార్టీకి, రమేష్ చెన్నమనేని గారికి కృతజ్ఞతలు తెలిపారు. మాల సంఘం తరుపున రూ.5116/-లు రమేష్‌బాబు గారి నామినేషన్ ఖర్చులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం జిల్లా అధ్యక్షులు ఆరే సత్యనారాయణ, టిఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు పుల్కం రాజు, సెస్ డైరక్టర్ రామతీర్థపు రాజు, అన్నారం శ్రీనివాస్, సీనియర్ నాయకులు పొలాస నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Economic development is possible only with TRS

Telangana news

Comments

comments