Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్త్రీ ఆర్థిక స్వేచ్ఛతో ప్రగతి

మహిళల ఆర్థిక సాధికారతతో దేశం, సమాజం బాగుపడుతాయి : ప్రధాని మోడీ
కోటి మందికి పైగా స్వయం సహాయక మహిళలతో మొబైల్ యాప్ సంభాషణ

Modiన్యూఢిల్లీ : ఆర్థికంగా స్వాతంత్య్రం కలిగిన స్త్రీలు సామాజిక దుష్టశక్తులకు అడ్డు గోడలుగా నిలుస్తారని ప్రధానమంత్రి మోడీ అన్నారు. దేశంలోని కోటి మందికిపైగా స్వయం సహాయక గ్రూపునకు  చెందిన మహిళలతో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా స్త్రీలకు అధికారం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలు వాణిజ్య రంగంలో  ముందుకు పోతున్నారు. వారికి మనం నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం మనం వారికి అవకాశాలు కల్పిస్తే  చాలని మోడీ మొబైల్ యాప్ ద్వా రా మహిళలతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు. మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఆర్థిక స్వతంత్రత  కలిగించినట్లయితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మన దేశంలోని మహిళలు చాలా శక్తివంతులని, వారిలోని సామర్థాలను గుర్తించాలన్నారు.  ఆర్థిక స్వాతంత్య్రం మహిళను దృఢంగా మార్చుతుందని, అంతేకాకుండా వారికి స్వయం నిర్ణయం తీసుకునే అధికారాన్ని అందిస్తుందని ప్రధాని అన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల స్త్రీలు పల్లె ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడపడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని  ఆయన ప్రశంసించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20 లక్షల స్వయం సహాయక గ్రూపు లు ఏర్పాటయ్యాయని, ఈ బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు.2కోట్ల 25 లక్షల కుటుంబాలు ఈ స్వయం సహాయక గ్రూపుల్లో చేరాయని ఆయ న తెలిపారు. దేశంలో మొత్తం 45లక్షల గ్రూపులు పని చేస్తున్నాయని, 5 కోట్ల మంది మహిళలు వాటి లో చురుగ్గా పని చేస్తున్నారన్నారు. ఈ ఐదు కోట్ల మంది  స్త్రీలు, తమ  కుటుంబంలో సంపాదించే మరో  వ్యక్తిగా  గ్రామీణ ప్రాంతాల్లో నిలిచారని  ఆయన కొనియాడారు. వ్యవసాయం, పాడి రంగాల్లో స్త్రీల పాత్ర లేకుండా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పుష్టి చేకూరదని, ఆదాయం చేకూర్చడంలో స్త్రీలు  కీలక భూమిక పోషిస్తున్నారని ఆయన చెప్పారు. స్వయం సహాయక గ్రూపు స్త్రీలతో నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు కొంతమంది స్త్రీలు ఉత్తేజపరిచే, గుండెలను తాకే తమ అనుభవాలను చెప్పారు. తమ జీవితాల్లో స్వయం సహాయ గ్రూపులు వెలుగులు నింపాయని తెలిపారు. దేశంలోని స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సంపత్తికి పునాది వేస్తున్నాయని, సమాజాన్ని మార్చే శక్తి సామర్థాలు దేశంలోని మహిళలకు ఉన్నాయని ఆయన తెలిపారు.

Comments

comments