Search
Friday 16 November 2018
  • :
  • :

విజయ్ మాల్యా… మోస్ట్ వాంటెడ్.!

Vijay-malya

న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలను కాజేసి విదేశాలకు పారిపోయిన వారి నుంచి డబ్బును రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ప్రమోజం మాత్రం శూన్యం. ఇందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థల్లో వేల కోట్లకు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాపై భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడానికి సన్నహాలు చేస్తోంది. బ్యాంక్ రుణాలు ఎగవేసిన వాళ్లను మోస్ట్ వాంటెడ్ గా గుర్తించాలన్నదే ఈ చట్టం మొక్క ముఖ్య ఉద్దేశం. మాల్యాకు సంబంధిచిన దాదాపు 12,500 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నిర్ణయం తీసుకుంది. ముంబయి కోర్డులో దీనికి చెందిన ఇడి ఓ దరఖాస్తును ఫైల్ చేసింది. ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ కింద ఆ కేసును నమోదు చేశారు. పరారీలో ఉన్న లోన్ డిఫాల్టర్ గా పరిగణలోకి తీసుకుంటూ మాల్యా ఆస్తులను సీజ్ చేయాలని కూడా నిర్ణయించారు. మాల్యాకు చెందిన కంపెనీలు, స్థిరచరాస్థులను సైతం తక్షణమే స్వాధీనం చేయాలని భావిస్తున్నారు. బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో ఇడి ఇప్పటి వరకు విజయ్ మాల్యాపై రెండు చార్జీషీట్ లను దాఖాలు చేసింది.

Comments

comments