Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

యూత్‌ఫుల్‌గా ‘ఇద్దరి మధ్య 18’

srinivas-yadavకార్తీక్, భాను జంటగా యస్.ఆర్.పి. విజువల్స్ బ్యానర్‌పై నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహిం చగా… ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మానేపల్లి హనుమంతరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాని ఆచార్య మాట్లాడుతూ “యూత్ అందరూ ఏ పాయింట్‌కు కనెక్ట్ అవుతారో అదే పాయింట్‌ను తీసుకొని సినిమా చేస్తున్నాం. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేయాలనుకుంటున్నాం”అని అన్నారు. నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ “నాని చెప్పిన కథ నచ్చి సినిమాను నిర్మించాలనుకుంటున్నాం. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు నాని కథను తయారు చేశాడు”అని తెలిపారు. హీరో కార్తిక్ మాట్లాడుతూ “దృశ్య కావ్యం సినిమా తర్వాత మరో మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. హీరోయిన్ భాను మాట్లాడుతూ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ, నటుడు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. దువ్వాసి మోహన్, మెల్కోటే, రచ్చ రవి, రాఘవ, అప్పారావ్, గీతాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కె.ఎం.క్రిష్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః బి.రాంచందర్ సింగ్.

Comments

comments