Search
Sunday 23 September 2018
  • :
  • :

‘ఇదేం దెయ్యం’ పాటల సందడి

Edem-Deyyamఏ.వి.రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద  ఫిల్మ్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తున్న చిత్రం ‘ఇదేం దెయ్యం’. శ్రీనాథ్ మాగంటి హీరోగా పరిచయమవుతున్నాడు. సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి. కీలక పాత్రధారులు. పి.రవివర్మ దర్శకత్వం వహించగా బాలు స్వామి సంగీతమందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆడియో సీడీలను ఆవిష్కరించి సినిమా యూనిట్ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఆ కమర్షియల్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. విజువల్స్, పాటలు బాగున్నాయి. నటీనటులంతా బాగా నటించారని పాటల్లోనే తెలుస్తోంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో మాగంటి శ్రీనాథ్ మాట్లాడుతూ “మంచి కథలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రచ్చ రవి, ఆర్‌పితో నా కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. సినిమా బాగా వచ్చింది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ “రచ్చ రవి, ఆర్‌పి, శ్రీనాథ్‌ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నా. నేను అనుకున్న దానికంటే వారు బాగా నటించారు. శ్రీనాథ్ కొత్త కుర్రాడైన చక్కగా నటించాడు. కామెడీ హైలైట్‌గా ఉంటుంది. హార్రర్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి”అని చెప్పారు. హీరోయిన్ సాక్షి కక్కర్ మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను నటించిన సినిమాలన్నిం టికంటే ఇందులో భిన్నమైన పాత్ర పోషించాను. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది”అని అన్నారు. ఈ వేడుకలో డి.ఎస్.రావు, సాగర్, తుమ్మ లపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments