Search
Tuesday 20 November 2018
  • :
  • :

ముష్టివాళ్లుగా మారుతున్న విద్యావంతులు

Beggingచదువుకున్న చదువులకు ఉద్యోగాలు, ఉపాధి దొరకకపోవడంతో చాలా మంది విద్యావంతులు ముష్టివాళ్లుగా మారుతున్న వైనం ఇది. నాన్ వర్కర్స్ బై మెయిన్ ఆక్టివిటీ అండ్ ఎడ్యుకేషన్ లెవల్‌పై 2011 సెన్సెస్ డేటా ఇటీవల సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం 3.72 లక్షల మంది భిక్షగాళ్లు ఉన్నారు. అయితే ఇందులో 75 వేల మంది 12వ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారంటే నమ్మగలమా! కాని ఇది నిజం. అంతే కాదండోయ్ ఇంకొందరైతే ఏకంగా డిగ్రీలు, పిజిలు పూర్తి చేసి కూడా ఈ వృత్తిలో కొనసాగుతున్నారని నివేదిక తెలుపుతుంది. ఇక గుజరాత్ రాష్ట్రానికి చెందిన దినేశ్ ఖొడాభాయ్(45) అనే వ్యక్తి 12వ తరగతి పూర్తి చేశాడు. అనంతరం కొన్ని రోజులు వార్డ్‌బాయ్‌గా పనిచేశాడు. అప్పుడు రోజుకు రూ.100 వచ్చేవి, ఈ సంపాదన తన కుటుంబ పోషణకు సరిపొలేదు. దీంతో చెసేదేమిలేక ప్రస్తుతం అహ్మదాబాద్‌లో భద్రకాళి దేవాలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు. ఇప్పుడు రోజుకు రూ.200 వరకు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇదండీ మన దేశ పరిస్థితి చదివిన చదువుకు ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు దొరికిన ఆ సంపాదన కుటుంబ పోషణకు సరిపోక చదువుకున్న వాళ్లు ముష్టివాళ్లుగా మారి భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారు.

Comments

comments