Home వార్తలు విద్య-ఉద్యోగ సమాచారం

విద్య-ఉద్యోగ సమాచారం

సిండికేట్ బ్యాంక్‌లో ఆఫీసర్ పోస్టుల భర్తీ
Studyసిండికేట్ బ్యాంక్ డిప్యుటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనే జర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
* అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎస్‌ఎమ్‌జీఎస్)- 3 పోస్టులు. ఇందులో ఎకానమిస్ట్- 1, స్టాటిస్టిషీయన్-1, కంపెనీ సెక్రటరీ-1 ఉన్నాయి.
* అర్హత: ఎకాన మిక్స్/స్టాటిస్టిక్స్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ వారికి 55 శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణత. కంపెనీ సెక్రటరీలో ఉత్తీర్ణత. కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి.
* వయస్సు: కనిష్టంగా 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లకు మించరాదు.
* పే స్కేల్: రూ. 59,170-66,070/-(మెట్రో పాలి టన్ నగరాల్లో డీఏ, సీసీఏ, ఇతర అలవెన్స్‌లతో కలిపి నెలకు సుమారుగా రూ. 1,12,891/-)
* మేనేజర్ (ఎమ్‌ఎమ్‌జీఎస్): 86 పోస్టులు
ఇందులో లా- 20, సీఏ- 51, సెక్యూరిటీ- 15
* అర్హత: లా లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన అనుభవం ఉండాలి, సీఏలో ఉత్తీర్ణత.
* వయస్సు: కనిష్టంగా 21 ఏండ్లు, గరిష్టంగా 35/45 ఏండ్లకు మించరాదు.
* పే స్కేల్ : రూ. 31,705-45,950/- (మెట్రో పాలిటన్ నగరాల్లో డీఏ, సీసీఏ, ఇతర అలవెన్స్‌లతో కలిపి నెలకు సుమారు రూ. 61,544/-)
* టెక్నికల్ ఆఫీసర్ (జెఎమ్‌జీఎస్): 26 పోస్టులు
ఇందులో సివిల్- 22, ఎలక్ట్రికల్-4 ఉన్నాయి.
* అర్హత: సివిల్/ ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో బీఈ/ బీటెక్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
* పే స్కేల్ : రూ. 23,700-42,020/- (మెట్రోపాలి టన్ నగరాల్లో డీఏ, సీసీఏ, ఇతర అలవెన్స్‌లతో నెలకు సుమారురూ. 49,012/- జీతం ఉంటుంది)
* వయస్సు: కనిష్టంగా 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.
* అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 600/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 50/-
* ఎంపిక విధానం : రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
* రాత పరీక్షలో రీజినీంగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సంబంధిత ఉద్యో గానికి సంబంధించిన పరిజ్ఞానం), ఇంగ్లీష్ అంశాలలో 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు వస్తాయి. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరి తేదీ: డిసెంబర్ 10
* ఇతర వివరాలకు http://www. syndicate bank.in వెబ్‌సైట్ చూడండి.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
మినీరత్న కంపెనీ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యో గాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* మేనేజ్‌మెంట్ ట్రెయినీ మొత్తం పోస్టుల సంఖ్య: 25 ( మార్కెటింగ్-12, ల్యాబ్-5, హెచ్‌ఆర్-5)
* అర్హతలు:
* హెచ్‌ఆర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/పీజీడీబీఎమ్ (పర్సనల్ మేనేజ్‌మెంట్, హెచ్ ఆర్, హెచ్‌ఆర్‌డీ) ఉత్తీర్ణత
* మార్కెటింగ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/ఎంఎస్సీ (అగ్రికల్చర్)తోపాటు ఎంబీఏ/ పీజీ డీబీఎమ్ (మార్కెటింగ్, అగ్రి మార్కెటింగ్) ఉత్తీర్ణత.
* ల్యాబ్: ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత.
* వయస్సు: 2015 డిసెంబర్ 1 నాటికి 29 ఏళ్లకు మించరాదు.
* ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
* దరఖాస్తు: ఆన్‌లైన్
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 28
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 19
* ఇతర వివరాలకు www.national fertilizers. comవెబ్‌సైట్ చూడండి.
ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ) ఖాళీగా ఉన్న జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది.
* మొత్తం పోస్టుల సంఖ్య: 10
* జూనియర్ సూపరింటెండెంట్- 4 పోస్టులు
* అర్హత: మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 35 ఏళ్లకు మించరాదు.
* లైబ్రెరీ ఇన్ఫర్మేషన్ సీనియర్ అసిస్టెంట్- 1
* అర్హత: లైబ్రెరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి.
* జూనియర్ అసిస్టెంట్- 2 పోస్టులు
* అర్హత: డిగ్రీలో ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానంలో ప్రావీణ్యత ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల్ల అనుభవం ఉండాలి. వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి.
* జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్- 3 పోస్టులు
* అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబం ధిత రంగంలో రెండేండ్ల్ల అనుభవం ఉండాలి. వయస్సు 30 ఏళ్లకు మించరాదు.
* ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో చేయాలి.
* దరఖాప్తులు పంపవలసిన చిరునామా:
REGISTRAR, IIT MANDI,
KAMAND- 175005 (HP)
* దరఖాస్తుకి చివరి తేదీ: డిసెంబర్ 14
* ఇతర వివరాలకు www.iitmandi.ac.inవెబ్‌సైట్ చూడండి.
రీసెర్చ్ స్కాలర్ ప్రోగ్రామ్
హైదరాబాద్ మియాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) యానిమల్ హెల్త్ అండ్ ప్రొడక్టవిటీల్లో రీసెర్చ్ చేయ డానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* కోర్సు పేరు: రీసెర్చ్ స్కాలర్ ప్రోగ్రామ్
* కోర్సు ప్రారంభం: 2016 జనవరిలో
* అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌లో ఉత్తీర్ణత.
* సీఎస్‌ఐఆర్, యూజీసీ, డీబీటీ, ఐసీఎమ్‌ఆర్, బీఐ ఎన్‌సీ, నెట్, యూజీసీ ఆర్జీఎన్‌ఎఫ్ (ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులు), బీఐఎన్‌సీ నిర్వహించిన డీబీటీ ఫెలోషిఫ్ లేదా గేట్ (ఆల్ ఇండియా టాప్ 50 ర్యాంక్స్) ఇన్ లైఫ్ సైన్సెస్/ కెమిస్ట్రీ లేదా జెస్ట్‌లో ఉత్తీర్ణత.
* గమనిక: మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ఎంబీబీఎస్ అభ్యర్థులకు ఎలాంటి అర్హత పరీక్ష అవసరం లేదు.
* వయస్సు: 2015 డిసెంబర్ 28 నాటికి 28 ఏళ్లకు మించరాదు.
* ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
* ఇంటర్వ్యూ ప్రదేశం: హైదరాబాద్
* దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
* దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా:
THE SENIOR MANAGER,
NATIONAL INSTITUTE OF ANIMAL BIOTECHNOLOGY (NIAB),
D. NO. 1-121/1, 4th and 5th FLOORS,
AXIS Clinicals Building,
OPP. TO CINE TOWN, MIYAPUR, HYDERABAD,
TELANGANA, INDIA PIN: 500 049.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 28
* ఆన్‌లైన్ హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ: డిసెంబర్ 3,2015.
* ఇతర వివరాలకు www.niab.org.in వెబ్‌సైట్ చూడండి.
ఎస్‌ఏఐలో రీసెర్చ్ ఫెలోలు
న్యూ ఢిల్లీలోని స్పోరట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) వివిధ రీజినల్ సెంటర్లలో రీసెర్చ్ ఫెలో చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* మొత్తం ఖాళీల సంఖ్య: 89 పోస్టులు
ఆంత్రొపోమెట్రీ- 13 పోస్టులు,న్యూట్రిషన్- 13 పోస్టులు,ఫిజియాలజీ-13 పోస్టులు,సైకాలజీ- 13 పోస్టులు, బయోకెమిస్ట్రీ-13పోస్టులు, బయో మెకా నిక్స్ -13 పోస్టులు,జీటీఎమ్‌టీ- 11 పోస్టులు
* ప్రదేశాలు: పాటియాలా, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్, గాంధీనగర్, సోనేపట్, గుహవటి, త్రివేండ్రం, లక్నో, ఇంపాల్
* వయస్సు: 31 అక్టోబర్ 2015 నాటికి 28 ఏళ్లకు మించరాదు
* అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్పోట్స్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ & డైటెటీక్స్, ఎంపీఈడీ, హ్యూమన్ బయాలజీ/ ఫిజికల్ ఆంత్రోపాలజీల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. UGC NET/ CSIR NETలో అర్హత సాధించినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
* స్ట్టైఫండ్: రూ. 25,000+ 30% హెచ్‌ఆర్‌ఏ
* ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్
* ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్ జరిగే ప్రదేశాలు: ఢిల్లీ, పాటియాలా, కోల్‌కతా, బెంగళూరు
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లు పంపాలి.
చిరునామా:
DIRECTOR (Personnel & Coaching),
SPORTS AUTHORITY OF INDIA,
JAWAHARLAL NEHRU STADIUM COMPLEX (EAST GATE),
GATE NO.10, LODHI ROAD, NEW DELHI-110003
* దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 21
* ఇతర వివరాలకు www.sportsauthorityof india.nic.inవెబ్‌సైట్ చూడండి.
నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజీఎన్‌టీయూ)లో ఖాళీగా ఉన్న 82 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
* మొత్తం పోస్టులు: 82
* ప్రయివేట్ సెక్రటరీ-3, అసిస్టెంట్ ఇంజినీర్ (సివి ల్)-1, సెక్యూరిటీ ఆఫీసర్-1, అసిస్టెంట్ -1, ప్రొఫె ష నల్ అసిస్టెంట్ -1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -5, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) -2, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-1, హిందీ ట్రాన్స్ లేటర్-1, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1, టెక్నికల్ అసిస్టెంట్ -6, ఫార్మాసిస్ట్-1, సెక్యూరిటీ ఇన్‌స్పెక్ట ర్-1, అప్పర్ డివిజన్ క్లర్క్-2, లైబ్రెరీ అసిస్టెంట్-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-9, లోయర్ డివిజన్ క్లర్క్-11, లైబ్రెరీ అటెండెంట్-2, ల్యాబొరేటరీ అటెండెం ట్-8, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-6, కిచెన్ అటెండెంట్-2, హాస్టల్ అటెండెంట్-2
* అర్హతలు: మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రెరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్, బీఈ లేదా బీటెక్ (సివిల్), ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రి ఇన్ (కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్వి రాన్‌మెంటల్ సైన్స్, బయో టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఇంటర్, పదో తరగతిల్లో ఉత్తీర్ణత. ఇంగ్లీష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/ 30 పదాల వేగం ఉండాలి.
* ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిపెంబర్ 30
* ఇతర వివరాలకు www.igntu.ac. in వెబ్‌సైట్ చూడండి.
సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)లో ఒక యూనిట్‌గా పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రే టివ్ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐజీఐబీ)లో పరి శోధన కోసం అర్హులైన సైంటిస్ట్ అభ్యర్థుల నుంచి దరఖా స్తులను ఆహ్వానిస్తోంది.
* పోస్టుల సంఖ్య: 8 (జనరల్-4, ఓబీసీ-2, ఎస్టీ-12 పీహెచ్-1)
* వయస్సు: సైంటిస్ట్‌కు 32 ఏండ్లు, సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లకు మించరాదు.
* పే స్కేల్: సైంటిస్ట్‌కు రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 6600/-, సీనియర్ సైంటిస్ట్‌కు రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 7600/-
* ఆన్‌లైన్ దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 21
* ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 22
* ప్రింట్ తీసిన ఆన్‌లైన్ దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2016 జనవరి 8
* వివరాలకు www.ibig.res.in వెబ్‌సైట్ చూడండి.
ప్రసార భారతిలో 60 ఉద్యోగాలు
ప్రసారభారతి ఆధ్వర్యంలోని బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీర్,ప్రోగ్రామ్),గ్రేడ్ 2 కెమెరామెన్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, కెమెరామెన్ వంటి ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన పీహెచ్ (స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చివరి తేదీ: 2015 డిసెంబర్ 23
* ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
* ఇతర వివరాలకు www.prasarbharti.gov.in వెబ్‌సైట్ చూడండి.