Home తాజా వార్తలు విద్యకు అధిక ప్రాధాన్యత….

విద్యకు అధిక ప్రాధాన్యత….

Minister Jagadish Reddy reviewed with power department officials

హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారుల వర్క్ షాప్ ను గురువారం నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ కు ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికే ధైర్యం వస్తుందన్నారు. మనుషుల జీవితాలకు వెలుగునిచ్చేవిద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. దళిత వర్గాల్లో షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ విశ్వాసం నింపుతుందని ఆయన పేర్కొన్నారు.