Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

Education problems should be solved

మనతెలంగాణ/చందుర్తి: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు యండి హామీద్ అన్నారు. వామపక్షాల విద్యార్థి సంఘాల పిలుపుమేరకు చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ, ప్రై వేట్ స్కూల్‌లతో పాటు జూనియర్ కళాశాలను గురువారం మూసి వేయించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు హామీద్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నా లుగు సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగ స మస్యల పరిష్కారం పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అ మలు పై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నాం భోజనాన్నిఅమలు చేస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించిన ఆ  ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రైవేట్ కార్పోరేట్ విద్యాలయాల దోపిడిని ఆరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చే యాలన్నారు. లేని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను వెంటనే మూసివేయించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేశ్, వంశీ, గౌతమ్, శ్రీహరి, ప్రసాద్, తదితరులు ఉన్నారు.

Comments

comments