Home వార్తలు విద్య ఉద్యోగ సమాచారం

విద్య ఉద్యోగ సమాచారం

ఇంజినీర్ పోస్టుల భర్తీ
Studentఇండియన్ రైల్వేలకు అనుబంధ సంస్థ రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ.
* మొత్తం ఖాళీల సంఖ్య – 56
* ఇంజినీర్ (సివిల్)లోఏఆర్‌ఈ (ట్రాక్ డిజైన్) – 1,అలైన్‌మెంట్ ఇంజినీర్ – 1,ఆర్‌ఈ సివిల్ – 2,
క్వాలిటీ ఎక్స్‌పర్ట్ – 2, కాంట్రాక్టు మేనేజర్ – 1,ఏఆర్‌ఈ ఎర్త్‌వరక్స్ – 10,ఏఆర్‌ఈ బ్రిడ్జ్ – 11,ఏఆర్‌ఈ బ్రిడ్జ్ కాస్టింగ్ యార్డ్ – 4,ఏఆర్‌ఈ ట్రాక్ (వెల్డింగ్ విభాగం) – 3,ఏఆర్‌ఈ బిల్డింగ్ – 2,
* ఏఆర్‌ఈ జియోటెక్ – 1,ఏఆర్‌ఈ సర్వే – 1,ఏఆర్‌ఈ సేఫ్టీ (సివిల్) – 1పోస్టులున్నాయి.
* వయస్సు: 2015, డిసెంబర్ 1 నాటికి 55 ఏళ్లలోపు ఉండాలి.
* అర్హతలు: మొదటి ఐదు పోస్టులకు ప్రథమశ్రేణిలో ఇంజినీరింగ్ (సివిల్)లో ఉత్తీర్ణత. మిగిలిన పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
* ఎంపికవిధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పంపాలి.
* చివరితేదీ: 2015, డిసెంబర్ 15
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత ఆ కాపీ ప్రింట్‌ను తీసి కింది చిరునామాకు డిసెంబర్ 22లోగా పంపాలి.
ASSISTANT MANAGER (P)/ RECTT.,
RITES LTD, RITES BHAWAN,
PLOT NO. 1, SECTOR-29,
GURGAON-122001, HARYANA
ఐఐటీ జేఈఈ ఎంసెట్ సీఏ, సీపీటీ కోచింగ్
2016-2017 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్‌తో పాటు ఐఐటీ జేఈఈ లాంగ్‌టర్మ్, ఎంసెట్ కోచింగ్, సీఏ, సీపీటీ కోచింగ్ కోసం తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* కాలేజీ వివరాలు: , టీఎస్‌డబ్ల్యూఆర్ (IIT -LTCD) జూనియర్ కాలేజీ- గౌలిదొడ్డి, టీఎస్‌డబ్ల్యూఆర్ COE- కరీంనగర్, అందించనున్న 10 మ్యాగ్నెట్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌ల్లో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందడానికి 2016 మార్చిలో పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థుల కోసం.
* తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషనల్ సొసైటీ( టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ప్రవేశ పరీక్షను 2016లో నిర్వహించనున్నది.
* కోర్సు పేరు: ఇంటర్+ఐఐటీ జేఈఈ, ఎంసెట్, సీఏ, సీపీటీ కోచింగ్
* గ్రూప్‌లు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ
* అర్హత: 2016 మార్చి లో పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులు
* పరీక్ష తేదీ: 2016 జనవరి 31
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 31
* వెబ్‌సైట్: www.tswreis.telangana.gov.in
ట్యాక్స్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీ
న్యూఢిల్లీలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఖాళీగా ఉన్న 14 ట్యాక్స్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన ప్రతిభావంతు లైన క్రీడాకారుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నిస్తోంది.
* అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లో ఉత్తీర్ణత. రాష్ట్ర/నేషనల్, ఇంటర్నేషనల్ పోటీ స్థాయిలోని సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొనా లి.
* వయస్సు: 2015 డిసెంబర్ 23 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక విధానం: సంబంధిత క్రీడాంశంలో గ్రౌండ్ టెస్ట్ / నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* పే స్కేల్ : రూ. 5200-20200+ గ్రేడ్ పే
రూ. 2400/-ప్రొబ్రెషనరీ పీరియడ్: రెండేండ్లు
* దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులందరూ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారా లను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి స్వయంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి.
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ:
2015 డిసెంబర్ 23
* చిరునామా:
THE ADDITIONAL COMMISSIONER OF INCOME-TAX (HQRS.-PERSONNEL),
ROOM NO. 378, C. R. BUILDING, I. P. ESTATE, NEW DELHI -110002.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో సిస్టమ్ అనలిస్ట్
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లోని ఖాళీగా ఉన్న సిస్టమ్ అనలిస్ట్ (కాంట్రాక్ట్ పద్ధతిన) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నది.
* అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ (కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత. జావా, ఆర్‌డీఎమ్‌ఎస్, ఎంఐఎస్, లైనెక్స్, ల్యాన్ రంగాల్లో అనుభవం ఉండాలి.
* దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారాపూర్తి వివరాలతో రెజ్యూ మే నుఅప్‌లోడ్ చేయాలి.
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ :
2015, డిసెంబర్ 11
* వివరాలకు వెబ్‌సైట్: http://careers.cgg.gov.in /applymdo చూడండి.
యూపీఎస్సీలో సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు
యూపీఎస్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్, జాయింట్ సెక్రటరీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బ్రాంచ్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
* సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్- 9 పోస్టులు
* జాయింట్ సెక్రటరీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ – 1 పోస్టు
* ప్రొఫెసర్- 1 పోస్టు
* అసోసియేట్ ప్రొఫెసర్- 3 పోస్టులు
* అర్హత: గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీ రింగ్, మాస్టర్ డిగ్రీ ఇన్ లా, బీఈ/బీటెక్ ఇన్ (సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఈ/ఎంటెక్ ఇన్ సాయిల్ మెకా నిక్స్, పౌండేషన్ ఇంజినీరింగ్, జియో టెక్నికల్ ఇంజి నీరింగ్, సాయిల్ డైనమిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజి నీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెకానికల్ ఇంజినీరింగ్) లో ఉత్తీర్ణత.
* ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: డిసెంబర్ 17
* వెబ్‌సైట్: http://upsconline.nic.in
సీఎస్‌ఐఆర్ ఎన్‌ఐఓలో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
గోవాలోని సీఎస్‌ఐఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* సైంటిస్ట్/ సీనియర్ సైంటిస్ట్- 21 పోస్టులు
* పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 6,600 (సైంటిస్ట్)/ గ్రేడ్ పే రూ. 7,600 (సీనియర్ సైంటిస్ట్)
* ప్రిన్సిపాల్ సైంటిస్ట్- 1 పోస్టు
* పే స్కేల్: రూ. 37,400-67,000+ గ్రేడ్ పే రూ. 8,700
* వయస్సు: 32 ఏళ్లకు మించరాదు (సైంటిస్ట్), 37 ఏళ్లకు మించరాదు (సీనియర్ సైంటిస్ట్), 45 ఏళ్లకు మించరాదు (ప్రిన్సిపాల్ సైంటిస్ట్)
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 28
* దరఖాస్తు పంపించడానికి చివరి తేదీ: డిసెంబర్ 28
* వెబ్‌సైట్: http://www.nio.org
ఎన్‌ఐఆర్‌డీలో స్టేట్ కో ఆర్డినేటర్స్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్‌లో ఖాళీగా ఉన్న స్టేట్ కో ఆర్డినేటర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* మొత్తం ఖాళీల సంఖ్య: 9
* ఉద్యోగం చేయాల్సిన ప్రదేశాలు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్,
* అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్‌ల్లో ఉత్తీ ర్ణత. రూరల్ డెవలప్‌మెంట్/ పావర్టీ, ట్రైబల్ వెల్ఫే ర్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
* పే స్కేల్ రూ. 80,000/-
* ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
* దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా:
PROFESSOR DHEAD,CENTRE FOR PANCHAYATI RAJ,
MAHATMA GANDHI BLOCK,
NATIONAL INSTITUTE OF
RURAL DEVELOPMENT & PANCHA YATI RAJ,RAJENDRANAGAR,
HYDERABAD-500030
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 11
* వివరాలకు వెబ్‌సైట్: www.nird.org.in చూడండి
రీసెర్చ్ ఫెలోషిప్
యూజీసీ బీఎస్‌ఆర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేయడానికి అర్హత కలిగిన ప్రతిభావంతులైన సైన్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఉస్మానియా యూనివర్సిటీ ఆహ్వాని స్తున్నది.
* యూజీసీ బీఎస్‌ఆర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జాగ్రఫీ)
* ఫెలోషిప్‌ల సంఖ్య: 5
* అర్హత: ఓయూలో పీహెచ్‌డీ ఇన్ జాగ్రఫీలో రిజస్టర్ చేసుకున్న అభ్యర్థులు. నెట్, స్ల్లెట్, గేట్, పీహెచ్‌డీలో అర్హత సాధించిన అభ్యర్థులు.
* ఫెలోషిప్‌లు: రూ. 14,000 (నెలకు), కాంటిజెన్సీ రూ. 12,000(ఏడాదికి)
* దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
* అప్లికేషన్ ఫీజు: రూ.100/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.50/-)
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 5
బయోకెమిస్ట్రీ :
*ఫెలోషిప్‌ల సంఖ్య: 6
* అర్హత: ఓయూలో పీహెచ్‌డీ ఇన్ బయోకెమిస్ట్రీలో రిజస్టర్ చేసుకున్న అభ్యర్థులు. నెట్, స్ల్లెట్, గేట్, పీహెచ్‌డీల్లో అర్హత సాధించిన అభ్యర్థులు.
* ఫెలోషిప్‌లు: రూ. 21,700 (నెలకు), కాంటిజెన్సీ రూ. 12,000(ఏడాదికి)
* అప్లికేషన్ ఫీజు: రూ.100/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.50/-)
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 2
ఫార్మసీ:
*ఫెలోషిప్‌ల సంఖ్య: 2
* అర్హత: ఎమ్ ఫార్మా(ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) అండ్ ఎమ్ ఫార్మా(ఫార్మాస్యూటికల్ అనాలసిస్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్)లో ఉత్తీర్ణత. ఓయూలో పీహెచ్ డీ ఇన్ ఫార్మసీలో రిజస్టర్ చేసుకున్న అభ్యర్థులు.
* ఫెలోషిప్‌లు: రూ. 14,000 (నెలకు), కాంటిజెన్సీ రూ. 12,000(ఏడాదికి)
* అప్లికేషన్ ఫీజు: రూ.100/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.50/-)
* దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 7
చిరునామా:
అభ్యర్ధులు సంబంధిత డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ పేరు తో ఉస్మానియా యూనివర్సిటీ-500007కు దరఖా స్తులు పంపాలి.వివరాలకు వెబ్‌సైట్ www.osm ania. ac.in చూడండి.
పీజీడీఎం
చెన్నైలోని లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (లిబా) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం)లో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది.
* అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
* ఎంపిక: క్యాట్/గ్జాట్ స్కోర్ ఆధారంగా.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 2016 జనవరి 2
వివరాలకు వెబ్‌సైట్ liba.edu చూడండి.
ఎన్‌ఐసీఎంఏఆర్ కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్) కింది పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ ఇంజ నీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్,రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్,హెల్త్, సేఫ్టీ, అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్ మెంట్,క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, మేనేజ్ మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్. పూర్తి వివరాల కోసం www.nicmar.ac.in వెబ్‌సైట్ చూడండి.