Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ మార్గనిర్దేశనం చేసుకోవాలి : కోదండరాం

telangana-margaaఢిల్లీలో విద్యావంతుల వేదిక సమావేశం
మన తెలంగాణ / న్యూఢిల్లీ : ఏడాది తెలంగాణ – భవిష్యత్ ప్రణాళిక అనే అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక దేశరాజధానిలో సదస్సు నిర్వహించింది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా, కేంద్ర సమాచార కమిషనర్ మాడ భూషి శ్రీధర్ అతిథిగా పాల్గొన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, కె.శ్రవ ణ్ కుమార్ ప్రసంగించారు. దేశ రాజధానిలో స్థిరపడ్డ తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొని తెలం గాణ పునర్నిర్మాణంలో పాటించాల్సిన జాగ్రత్త లపై సూచనలు చేశారు.

తెలంగాణ ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని జాతీయ బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వర య్య ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సామాజి క తెలంగాణ నిర్మించాలన్న ఆశయం నీరుగారి పోతోందని అన్నారు. తెలంగాణ బిసి కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలను అధికారానికి దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. తెలంగా ణ కోసం త్యాగాలు చేసిన వారిని రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడం శోచనీ యమని అన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రొఫెసర్ కోదండరాం సరి కొత్త ఉద్యమానికి తెరలే పాలని కోరారు. తగిన వనరులతో సుసంపన్నంగా ఉన్న తెలంగాణను రాష్ట్ర సర్కారు ఆశించిన మేర ప్రగతి పట్టాలపై ఎక్కించలే కపోతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలను పక్కన పెట్టాలని సూచించారు.

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస ఇచ్చిన హామీ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిందే అని అన్నారు. రాజ్యాంగ పరంగా ఇది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అనంతరం ప్రసంగిం చిన కోదండరాం రాష్ట్రం ఏర్పడగానే అన్ని సమస్యలు వెంటనే పరిష్కారమ వుతాయని తాను ఎప్పుడు భావించలేదని అన్నారు. అయితే తెలంగాణను కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి చేయగలిగామని చెప్పారు. మారిన పరిస్థితు ల నేపథ్యంలో తెలంగాణ మార్గనిర్దేశనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

స్పష్టమైన దృక్పథంతో అందరూ సమాయత్తం అవ్వాలని సూచిం చారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు తన వంతు సాయం చేస్తానని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఈపాటికే ఆయా రంగాల వా రీగా సమస్యలను గుర్తించామని చెప్పారు. చేతివృత్తులు మొదలు వ్యవసా యం వరకు ఈ రోజు అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. 1998 నుంచి తెలంగాణలో 28 వేలమంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ ఆశయాలను నెరవేర్చే ప్ర భుత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ప్రసంగించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు ఆవైపు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు.

Comments

comments