Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఏడుపాయల జాతర ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష

EDUPAYALA

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : ఏడుపాయల వనదుర్గా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో 24, 25, 26 తేదిలలో జరుగనున్న ఏడుపాయల జాతర సందర్భంగా గురువారం నాడు అధికారులతో సమావేశమై ముందస్తు ఏర్పాట్లపై సమీక్షిం చారు. ఈనెల 27న వచ్చే మాఘ అమావాస్య రోజున భక్తులు అధికంగా వచ్చే అవకాశమున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమక్క సారాలమ్మ జాతర తరహాలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న పనులను ఇప్పటికే మంజూరు చేసుకున్నందున ప్రధాన్యతను ఇచ్చి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రతిసారి జాతర సందర్భంగా ఈసారి తాగునీటి సమస్య ఉండబోదని, తాగునీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించని అధికారులపై ఎంత మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. నీటి నిల్వలు, బారికేటింగ్ పనులు, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని, స్త్రీలు బట్టల మార్పిడికి, స్నానాలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాగునీరు పరిశుభ్రత చర్యలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, మున్సిపల్ పంచాయతీ అధికారులు చేపట్టాలని కోరారు. ఎట్టి పరిస్థితిలోను జాతర పరిసర ప్రాంతాలలో బహిరంగ మలవిసర్జన జరుగరాద న్నారు.

భక్తుల సౌకర్యార్థ్ధం ఒక అత్యవసర చికిత్సా శిభిరం, ఇన్‌పేషెంట్ విభాగంతో పాటు, 10 ప్రాథమిక చికిత్స శిభిరాలు ఏర్పాటు చేసి వైద్యాధికారులను, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ జిల్లా వైద్యారోగ్య అధికారిని కోరారు. జాతరకు ఎడ్లబండ్లపై భక్తులు పెద్దఎత్తున రానున్నందున పశువైద్యశిభిరాలతో పాటు దేవాలయ పరిసప్రాంతాలలో జంతువధ జరకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను నడుపాలని కోరారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అక్రమ మద్యం, మద్యం జాతరలో లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎక్స్‌సైజ్ అధికారులకు తెలిపారు. త్రీఫెజ్ విద్యుత్‌లైన్‌తో పాటు వీధి దీపాలు విడిగా ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో, మున్సిపాలిటీ, దేవాదాయఖాఖ అధికారులను కోరారు. అధికారులు అనుమతి లేకుండా ఉన్నతాధికారుల దృష్టికి తేకుండా జాతరలో వాహనాలకు పార్కింగ్ రుసుము వసూలు చేయడంపై కలెక్టర్ దేవస్థానం ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్కింగ్ వసూలు వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సురేష్‌బాబు, డిఆర్‌వో నగేష్, ఆర్డివో వెంకటేశ్వర్లు, పోలీసు, ఎక్సైజ్, రవాణ, దేవాదాయశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments