Home కరీంనగర్ చేనేత కార్మికుల శ్రమ వృథా కానివ్వ

చేనేత కార్మికుల శ్రమ వృథా కానివ్వ

 వారి కష్టాలు చెప్పలేనివి
 చిన్నతనంలోనే దగ్గర్నుంచి చూసిన
 శభాష్ బిడ్డా అనేలా పనిచేస్తా
 సమస్యల పరిష్కారానికి వెన్నంటి ఉంటా
 కార్మికులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలె
 చేనేత మహాసభలో రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్

kmnr2కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో చేనే త సహకార సంఘం మినీ ప్యాకేజీ డై యూనిట్‌లో 65వ చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసిన మ హాసభకు రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లా డుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. మాటలు, చేతలకు పొంతన ఉండాల ని జిల్లాలో చేనేత, సన్నకారు, గీతా కార్మికులు, అ లాగే అన్ని కులాలు సాయం కోసం ఎదురు చూస్తు న్నాయని చెప్పారు. వారందరికీ ప్రభుత్వం తరఫున సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తె లంగాణ ఉద్యమంలో పద్మశాలి కులస్థులు వెన్నుద న్నుగా నిలిచి, ముందు వరుసులో నిలుచారని గు ర్తుచేశారు. పద్మశాలి కులం అంటేనే బతికి చెడ్డ కులమని, ఒకప్పుడు సంస్కృతీ సంప్రదాయాలతో ఉన్నతంగా బతికిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటిగా చొరవ చూపు తుందని, కార్మికులు పాత పద్ధ్దతుల్లో కాకుండా వస్త్రాల తయారీలో నూతన ఒరవడికి శ్రీకారం చుడు తూ మార్పు తీసుకురావాలని సూచించారు.

చేనేత సంఘాలన్నింటికీ ఇప్పటికే మగ్గాల కార్మికుల కో సం 270 రుణాలను అందజేశామని, ఎలుబాకలో షెడ్‌కు రూ.15 లక్షలు, కందుగులలో షెడ్‌కు రూ. 18 లక్షలు, మరో 9 సంఘాల షెడ్ల నిర్మాణానికి జిఒ జారీ చేస్తామని చెప్పారు. అలాగే చేనేత సం ఘాల బలోపేతం కోసం చొరవ చూపుతామని మం త్రి భరోసా ఇచ్చారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ మాట్లాడుతూ చేనేత కార్మికులు నాణ్యమైన వస్త్రాల ను తయారు చేయాలని సూచించారు. కమలాపూర్ చేనేత క్లస్టర్ అభివృద్ధి పథంలో ముందుందని, కా ర్మికులు బిజినెస్‌లో మార్పులు తీసుకురావాలని పి లుపునిచ్చారు. ప్రజల అవసరాలు, అభిరుచులకు అ నుగుణంగా తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలను రూపొందిచాలన్నారు. కార్మికులు స్వతాగ పని చే సుకునేలా ప్రధాన మంత్రి పథకం ముద్రలో భాగం గా రూ.50 వేల రుణాలు అందజేస్తున్నామని తెలి పారు. త్వరలోనే చేనేత ఆత్మహత్యల నివారణ కో సం పెద్దఎత్తున అవగహన సదస్సును ఏర్పాటు చేస్తు న్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లాం డిగే లక్ష్మణ్ రావు, జడ్పిటిసి మారపెల్లి నవీన్ కు మార్, వైస్ ఎంపిపి దశరథం, సర్పంచ్ సమ్మయ్య, ఎంపిటిసి రమేశ్, ఆప్కో డైరెక్టర్ సత్య నారాయణ, చేనేత జౌళి శాఖ ఎడి వెంకటేశం, చేనేత సహకార సంఘం కమలాపూర్, వీణవంక మండలాల అధ్య క్షుడు భైరి లక్ష్మీనారాయణ, రమేశ్, సంఘం డైరెక్ట ర్ కొండి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.