Search
Friday 16 November 2018
  • :
  • :

సంక్షేమంలో నెంబర్‌వన్ తెలంగాణ : ఈటెల రాజేందర్

Eetelaమన తెలంగాణ/ హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలబడిందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కార్మికశాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్ట్రం కావడంతో నిలదొక్కుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టినప్పటికీ ప్రజలు ఓపికతో సహకరించారని ఆయన అన్నారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు తనదైన ముద్రను వేసుకో గలిగిందని ఆయన చెప్పారు. కార్మికుల సంక్షేమం పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అంకితభావం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

comments