Home వరంగల్ రూరల్ జై జవాన్ జై కిసాన్ నినాదంతో కెసిఆర్ ముందుకు

జై జవాన్ జై కిసాన్ నినాదంతో కెసిఆర్ ముందుకు

Eetela Rajender Speech About Ryth Bandhu Scheme

మన తెలంగాణ/నర్సంపేట/దుగ్గొండి : దేశాన్ని కాపాడే సైనికున్ని దేశానికి అన్నంపెట్టే రైతులను కాపాడుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆర్థిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురంలో గోదాంను అడవిరంగాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపి సీతారాంనాయక్, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నర్సంపేట మార్కెట్ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో బాగుపడ్డామా బతికి చెడ్డామా అనే దీనస్థితిలో కాలం వెళ్లబుచ్చామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో46 సంవత్సరాల కాంగ్రెస్ పాలన 17 సంత్సరాల టిడిపి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోపడి  రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు కేసిఆర్ దృఢ సంకల్పంతో వ్యవసాయ రంగానికి పెద్దపీటవేశారని అన్నారు..ఉచితంగా 24గంటల కరెంటు,రైతుబీమాపథకం,ప్రాజెక్టుల నిర్మాణంలోపాటు రైతుల పెట్టుబడుల కోసం ఎకరాకు  రెండుపంటలకుగాను 8 వేల రూపాయలు రైతుబంధు పథకంకింద అందిస్తున్నట్లు వివరించారు.రాష్ట్రంలో 48 వేల చెర్వులలో మిషన్ కాకాతీయతో పూడికను తీయించి మరమత్తులు చేయించినట్లు తెలిపారు.

కేసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబందు పతకాన్ని కాంగ్రేస్,బిజేపి,టిడిపి పార్టివారు విమర్శలు చేయకుండా వారు పరిపాలన చేసే పక్క రాష్ట్రాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రేస్ ప్రభుత్వం వస్తే 2లక్షల రూపాయలు రైతులకు రుణమాఫి చేస్తామని అంటున్న ఉత్తంకుమార్‌రెడ్డి పక్కరాష్ట్రమైన కర్నాటకలో అమలు చేసిచూపించాలని డిమాండ్ చేశారు.44మంది 8లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్‌లకు ఎగనామంపెడితే పన్నుల రూపంలో రెండు లక్షలకోట్లు జమచేశారు,49 అక్షల మంది రైతులకు 17వేల కోట్లరూపాయలు రుణమాఫీచేస్తామంటె మోది ఎందుకు సహకరించలేదో ప్రజలకు సమాదానం చెప్పాలని అన్నారు. నాడు యూపిఏ ప్రభుత్వం బాంకుల్లో అప్పులు కట్టలేని వారికి 3వేల 380 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే,కేసిఆర్ బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు 4దఫాలుగా 17వేల కోట్ల రూపాయలను రుణ మాపీచేశారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే కాలేశ్వరం,భద్రాది,సీతారామ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు రెండుపంటలకు పరిపడా నీళ్లు అందించెందుకు పాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 2018, 19, 20 సంవత్సరాల్లో గోదావరి జళాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేయనున్నట్లు తెలిపారు. కల్తి విత్తనాలతో రైతులు మోసపోకుండా పిడియాక్టు తీసుకువచ్చినట్లు తెలిపారు.విత్తనాలు,ఎరువుల కోసం రైతులు క్యూలో నిబడె పరిస్థితి లేదన్నారు.
ఎంపి సీతారాంనాయక్ మాట్లాడుతూ..
కేసిఆర్ రైతుబందు పథం ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.4 నెలల్లో గోదావరి జళాలను నర్సంపేట నియోజెక వర్గానికి అందించనున్నట్లు తెలిపారు.ఉద్యమంలో పనిచేసిన వారిని టిఆర్‌ఎస్ పార్టి గుర్థిస్తుందని తెలుపుతూ మార్కెట్ చైర్మన్‌గా బత్తిని శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం సంతోషదాయకమన్నారు
పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ…
పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ…….
గోదావరి జళాలను నర్సంపేటకు 4నెలల్లో అందిస్థా మని తెలిపారు.ఇప్పటి వరకు నియోజక ర్గంలో 17సబ్‌స్టేషన్లు మంజూరు చేసి ప్రారంబించినట్లు తెలిపారు.అనంతరం నర్సంపేట మార్కెట్ చైర్మన్‌గా బత్తిని శ్రీనివాస్‌గౌడ్,వైస్ చైర్మన్‌గా పోన్నం మొగిలితో పాటు పాలక వర్గాన్ని ఆర్డిఓ ఎన్ రవి మంత్రి ఈటల రాజెందర్ అద్వర్యంలో ప్రమాన స్వీకారం చేయించారు.
స్థల దాతకు సన్మానం…
సబ్ స్టేషన్ నిర్మాణం కోసం మండలంలోని అడవి రంగాపురం గ్రామంలో స్థలాన్ని అందించిన స్థల దాతకు సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తన వంతు సహాయాన్ని తన తండ్రి జ్ఞాపకార్ధం అందించిన విశ్వాస్ హాస్పటల్ డాక్టర్ పరుపాటి ప్రవీణ్‌రెడ్డిని అభినందించారు. పు ట్టిన ఊరుకు తోడ్పాటును అందించాడానికి ముం దుకు రావడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుక్కముడి సుశీల-కమలాకర్,జెడ్పిటిసి రజిత-రాజేశ్వర్‌రావు తదితరులున్నారు.