Search
Friday 21 September 2018
  • :
  • :

వేగం.. ప్రమాదం

Effects of drivers speed on the frequency of road accidents

మితిమీరిన వాహన వేగం వల్ల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్ల రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎన్నో జీవితాలను కబళిస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్నా, గతుకులుగా మారినా వాహన డ్రైవర్ల నిర్లక్షానికి బలవుతున్నారు.

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి :  మితిమీరిన వాహన వేగం వల్ల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్ల రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎన్నో జీవితాలను కబళిస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్నా, గతుకులుగా మారినా వాహన డ్రైవర్ల నిర్లక్షానికి బలవుతున్నారు. చాలాసార్లు మద్యం మత్తులో నడిపించడం వల్ల  ప్రమాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  దేశవ్యాప్తంగా 1.50 లక్ష మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మృ త్యు వాత పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యేటా 15 వేల మంది ప్రాణాలు కోల్పోగా తెలంగాణలో సగటున యేటా 6 వేల మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  క్షతగాత్రులై అంగవైకల్యంతో నరకయాతన పడుతున్నవారి .  తాజాగా ఆదివారం యాదా ద్రి జిల్లాలో జరిగిన ట్రాక్టర్ బోల్తా సంఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడల్లా రవాణాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం, వారు తనిఖీలు నిర్వహించి ఛలానా విధించి కేసులు నమోదు చేయడంతో సరిపెడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వపరంగా పలు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉన్నది.

భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉన్నది. వాహనాల వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్డు డివైడర్లు గల రహదారులు ఎక్కువగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చని చెబుతున్నారు. ఓవర్‌టేక్  చేసే సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. డివైడర్లు ఉంటే ఎదురుగా వాహనాలు వచ్చే ఆస్కారం ఉండదు. కార్లు, జీపులు, ఓల్వోబస్సుల వేగం గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల కంటే ఎక్కువగా నడుస్తున్నాయి. వాటి వేగం గంటలకు 100 కిలోమీటర్లకు మించి ఉండకుండా చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు. హైవేలపై ఉంటే టోల్‌గేట్ల వద్ద వాహనాల నెంబర్లు అవుతుంటాయి. టోల్‌గేటు నుంచి మరో టోలుగేటుకు వెళ్లేందుకు వాహనానికి ఎంత సమయం పడుతుందో రికార్డు అవుతుంది. దాని ఆధారంగా వాహనదారులకు జరిమానాలు విధించవచ్చని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేగం తో వెళ్లే వాహనాలను 4 లైన్ల రహదారులకే పరిమితం చేయాలి.  ఇలాంటి రహదారులు వందల కిలోమీటర్ల పొడువునా విస్తరించి ఉంటాయి. రోడ్డు డివైడర్లు కూడా ఉండటం వల్ల పెద్దగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. కొన్ని సందర్భాలలో నిద్ర, మద్యం మత్తులో నడుపడం వల్ల జాతీయ రహదారులపైనా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి.

Comments

comments