Home తాజా వార్తలు నెలలు నిండని బిడ్డల మెదడు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం

నెలలు నిండని బిడ్డల మెదడు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం

babyవాషింగ్టన్ : నెలలు నిండకుండా ముందుగా పసికందులు పుడితే వారి మెదడు పనితీరులో మార్పు వస్తుందని భవిష్యత్తులో కూడా మెదడు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ఈ అధ్యయనం వెల్లడైంది. హెల్సింకి, ఫిన్‌లాండ్ ల నుంచి 94 పసిబిడ్డల నుంచి డేటా సేకరించారు. వీరిలో 42 మంది 27 వారాల కన్నా ముందుగానే జన్మించారు. ఇంతేకాక నెలలు పూర్తిగా నిండి జన్మించిన 52 మంది పసికందులను కూడా అధ్యయనం లోకి తీసుకున్నారు.

నాణ్యమైన నిద్ర అన్నది మెదడు ఆరోగ్యానికి సూచిక వంటిది. ముఖ్యంగా పసికందుల్లో ఇది గమనించ వలసిన విషయం. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లోను, నెలలు పూర్తిగా నిండిన తరువాత పుట్టిన పిల్లల్లోను నిద్ర పోయే విధానాల తేడాను రెండు వారాల పాటు అధ్యయనం చేసినట్టు పరిశోధకులు వివరించారు. నెలలు పూర్తిగా నిండిన తరువాత పుట్టిన బిడ్డల్లో వారి వివిధ నిద్రావస్థల్లో మెదడు పనితీరు వ్యవస్థ చెప్పుకోతగినంతగా పునరుద్ధరింప బడినట్టు గుర్తించామని దీనికి భిన్నమైన పరిస్థితి నెలలు నిండని పిల్లల మెదడులో కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.

సైన్స్ విభాగం

Effects of Stress on Brain Development